ETV Bharat / business

'కరోనా భయపెడుతోంది స్టాక్ మార్కెట్లు మూసేయండి' - వ్యాపార వార్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. ఈ కారణంగా అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. స్టాక్ మార్కెట్లూ రికార్డు స్థాయిలో నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లను కొన్నాళ్లు మూసేయాలని పలు దేశాలు సూచిస్తున్నట్లు సమాచారం.

corona impact on stock markets
కరోనా భయపెడుతోంది మార్కెట్లు మూసేయండి
author img

By

Published : Mar 19, 2020, 9:06 AM IST

కరోనా ప్రభావం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. అది కూడా వరుసగా.. విరామం ఇవ్వకుండా. దీంతో దిగ్గజ సూచీలన్నీ కుదేలవుతున్నాయి. పటిష్ఠ మూలాలున్న షేర్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. మదుపరుల్లో నెలకొన్న తీవ్ర భయాందోళనలు ఇందుకు కారణమవుతున్నాయి. అసలు ఏ దేశం మార్కెట్లు కూడా ఏమాత్రం కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ముందుకు ఓ ప్రతిపాదన వచ్చింది.

మార్కెట్లు ఇలా ప్రతి రోజు పడిపోతున్నప్పుడు మూసివేయడమే మంచిదని అక్కడి అసెట్‌ మేనేజర్లు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అటు అమెరికా మార్కెట్ల విషయంలోనూ ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ కావచ్చు.. అమెరికా కావచ్చు... ఒకవేళ స్టాక్‌ మార్కెట్‌ మూసివేతగా ఇవి నిర్ణయం తీసుకుంటే మిగతా దేశాలు కూడా వాటిని అనుసరించే అవకాశాలు లేకపోలేదు. బహుశా మన మార్కెట్ల విషయంలోనూ ఇలా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: ఇక దగ్గినా, తుమ్మినా సెలవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.