సామాన్యులకు చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి షాకిచ్చాయి. వంట గ్యాస్ ధరను రూ.25 పెంచాయి. దీనితో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.794 నుంచి రూ.819కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు స్పష్టం చేశాయి.
వంట గ్యాస్ ధర 2020 డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు రూ.255 పెరిగింది. ఈ ఏడాది జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మూడు సార్లు వంట గ్యాస్ ధరలు పెరిగాయి.
అదేసమయంలో, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ ధరనూ రూ.95 పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. తాజా నిర్ణయంతో ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,614 వద్దకు చేరింది. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమలులోకి రానున్నాయి.
ఇదీ చదవండి:జీఎస్టీ వార్షిక రిటర్నులకు మరోమారు గడువు పొడిగింపు