ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలోని 17 శాతం(2,200 మంది) ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు దిగ్గజ కోకాకోలా కంపెనీ వెల్లడించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
అమెరికాలోని కోకాకోలా కంపెనీపై దీని ప్రభావం అధికంగా పడనుంది. దాదాపు 10,400మంది ఉద్యోగులున్న కంపెనీ నుంచే.. ఎక్కువ మందిని తొలగించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ సంస్థ... గతేడాది చివర్లో ప్రపంచవ్యాప్తంగా 86,200 ఉద్యోగులను నియమించుకుంది.
కరోనా కారణంగా సినిమా హాళ్లు, క్రీడా మైదానాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కోక్ సంస్థకు మొత్తం ఆదాయంలో 9శాతం నష్టం వాటిల్లింది. ఫలితంగా జులై-సెప్టెంబర్లో ఆ కంపెనీ ఆదాయం 8.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నష్టం నుంచి గట్టెక్కేందుకు కోక్ సంస్థ తమ బ్రాండ్లను సగానికి తగ్గిస్తోంది. ఈ సంవత్సరం టాబ్, జికో కొబ్బరి నీరు, డైట్ కోక్ ఫియెస్టీ చెర్రీ మొదలైన బ్రాండ్లను తొలగిస్తోంది.