ETV Bharat / business

2020-21లో భారత వృద్ధి రేటు 9-10 శాతం: సీఐఐ

దేశ జీడీపీ వృద్ధి బలంగా పుంజుకుని 9-10 శాతం మధ్య నమోదు కావొచ్చని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ మండలిలో సభ్యులుగా ఉన్న సీఈఓలు అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రభావం సేవలు, తయారీ రంగంపై పడుతుందనే ఆందోళన సీఐఐ నిర్వహించిన పోలింగ్​లో​ వ్యక్తమైంది.

cii
సీఐఐ
author img

By

Published : Dec 20, 2021, 7:13 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) జీడీపీ వృద్ధి బలంగా పుంజుకుని 9-10 శాతం మధ్య నమోదు కావొచ్చని పలువురు ముఖ్య కార్యనిర్వహణాధికారు (సీఈఓ)లు అభిప్రాయపడ్డారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ మండలిలో సభ్యులుగా ఉన్న సీఈఓలతో ఈ పోలింగ్‌ నిర్వహించారు. అయితే కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రభావం సేవలు, తయారీ రంగంపై పడుతుందనే ఆందోళనా వ్యక్తమైంది. 'వ్యవస్థలో నగదు లభ్యత పెంచడం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందించడం, ప్రభుత్వ వ్యయాలు పెంచడం, నియంత్రణలను సులభతరం చేయడం వంటి పలు సంస్కరణలను ప్రభుత్వం చేపట్టడంతో అధిక వృద్ధిపై ఆశావాహంతో ఉన్నామ'ని సీఐఐ అధ్యక్షుడు టి.వి.నరేంద్రన్‌ వెల్లడించారు. ఈ పోల్‌లో 100 మంది సీఈఓలు పాల్గొన్నారు. పోల్‌లో వీరు వెల్లడించిన అంశాలు..

  • ఒమిక్రాన్‌ సేవల రంగంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని 55 శాతం మంది సీఈఓలు, తయారీ రంగ కార్యకలాపాలు దెబ్బతింటాయని 34 శాతం మంది అంచనా వేశారు.
  • 2021-22లో వృద్ధి 9-10% మధ్య నమోదు కావొచ్చని 56% మంది పేర్కొనగా, 10 శాతానికి మించి నమోదయ్యే అవకాశం ఉందని 10% మంది అభిప్రాయపడ్డారు.
  • 2019-20తో పోలిస్తే (కొవిడ్‌ ముందు) ఈ ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపారాలు 10-20% మేర అధిక ఆదాయాల్ని ఆర్జిస్తాయని 35% మంది సీఈఓలు; 20% కంటే ఎక్కువగా ఆదాయాలు నమోదు కావొచ్చని 33% మంది సీఈఓలు తెలిపారు. స్థూల లాభాలు 20% కంటే పెరుగుతాయని 35% మంది, 10-20 శాతం పెరగొచ్చని 17% మంది పేర్కొన్నారు.
  • వ్యాపార కార్యకలాపాల్లో పురోగతి బాగుందని, తమ కంపెనీలు 70-100% సామర్థ్యంతో పని చేస్తున్నాయని 59% మంది సీఈఓలు తెలిపారు.
  • 2022-23లో తమ కంపెనీల మూలధన వ్యయాలు రూ.500 కోట్ల వరకు ఉండొచ్చని 62% మంది వెల్లడించారు.
  • గత ఏడాది కాలంలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిధుల్ని సమీకరించలేదని 71 శాతం మంది పేర్కొనగా, రుణాలు తీసుకున్నట్లు 18 శాతం మంది, దేశీయ, అంతర్జాతీయ విపణుల నుంచి ఈక్విటీ రూపంలో నిధుల్ని సమీకరించామని 11 శాతం మంది సీఈఓలు తెలిపారు.
  • ఎగుమతులకొస్తే 2019-20 కంటే 20% అదనంగా వృద్ధి నమోదు కావొచ్చని 35% మంది సీఈఓలు, అదే స్థాయిలో ఉండొచ్చని 24% మంది వెల్లడించారు. 50 శాతానికి పైగా నమోదు కావొచ్చని 10% మంది తెలిపారు.
  • దిగుమతులకొస్తే చైనా నుంచి 10 శాతం కంటే తక్కువగా వస్తువుల్ని తమ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయని 73% సీఈఓలు తెలుపగా, 10-25% మధ్యలో దిగుమతులు చేసుకుంటున్నట్లు 22% మంది పేర్కొన్నారు.

2022-23లో రూ.35.63 లక్షల కోట్ల ఎగుమతులు!

అంతర్జాతీయ మార్కెట్లలో కొవిడ్‌ ప్రభావంతో ఈ ఏడాది నెమ్మదించిన గిరాకీ, వచ్చే ఏడాది బలంగా పుంజుకుంటుందని, ఫలితంగా భారత్‌ ఎగుమతులు కొత్త ఏడాదిలో మరింత వృద్ధి చెందుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు, అంతర్జాతీయంగా గిరాకీ వృద్ధి, కొన్ని మధ్యంతర వాణిజ్య ఒప్పందాలు కలిసి భారత్‌ ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేయనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) కూడా భారత్‌ ఎగుమతులపై సానుకూల అంచనా వేసింది. ఈ సంస్థ వెలువరించిన అంచనాల్లో 2022-23లో భారత్‌.. అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య పరిమాణం 4.7 శాతం మేర పెరుగుతుందని తెలిపింది. 2021-22లో భారత ఎగుమతులు 40,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.30 లక్షల కోట్ల) స్థాయిని అధిగమిస్తాయని, 2022-23లో 47,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.35.63 లక్షల కోట్ల)కు చేరతాయని ఎగుమతిదార్లు అంచనా వేస్తున్నారు.

అయితే ఎగుమతుల వృద్ధి, అంతర్జాతీయ గిరాకీ.. వంటివి కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను వివిధ దేశాలు ఎంతమేరకు నియంత్రిస్తాయి.. ప్రపంచవ్యాప్తంగా టీకాల కార్యక్రమం ఎలా సాగుతుంది..అనే దానిపై ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గత సెప్టెంబరులో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021 మార్చి 31 నాటికి భారతీయ కంపెనీల సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతులు 14,830 కోట్ల డాలర్ల (సుమారు రూ11.12 లక్షల కోట్ల)కు చేరాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ముడి చమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియా చమురు విక్రయాల ద్వారా ఆశిస్తున్న 14,530 కోట్ల డాలర్ల కంటే ఈ మొత్తం ఎక్కువని తెలిపింది.

ఇదీ చూడండి: LIC IPO: వచ్చే త్రైమాసికంలో ఎల్‌ఐసీ ఐపీఓ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.