ETV Bharat / business

2636 ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్​సిగ్నల్​ - ఎలక్ట్రిక్ వాహనాల వార్తలు

విద్యుత్​ వాహనాల(ఈవీ) వినియోగం పెంచేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీలకు ప్రధాన ఆటంకమైన ఛార్జింగ్ సమస్య తీర్చేందుకు దేశవ్యాప్తంగా 62 నగరాలకు 2636 విద్యుత్​ ఛార్జింగ్ కేంద్రాలు మంజూరు చేసింది.

ev
విద్యుత్ వాహనాలు
author img

By

Published : Jan 4, 2020, 8:23 AM IST

దేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) కొనుగోళ్లు, వినియోగం పెరిగేందుకు ప్రధాన ఆటంకం ఛార్జింగ్‌ స్టేషన్లు కొరవడటమే. ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా ఒకసారి ఛార్జింగ్‌ పెడితే, ఎక్కువదూరం ప్రయాణించడానికి అనువుగా ఉండటం లేదు. ఈ ఇబ్బంది నివారించడానికి 24 రాష్ట్రాల్లోని 62 నగరాలకు 2636 విద్యుత్తు ఛార్జింగ్‌ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఇందువల్ల కంపెనీలూ విద్యుత్తుతో నడిపే సరికొత్త మోడళ్లు రూపొందించేందుకు ముందుకు వస్తాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్తు వాహనాల వినియోగం, అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రతిపాదించిన 'ఫేమ్‌' పథకం రెండోదశ కింద, ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రోత్సాహకాలు అందుకునేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను భారీ పరిశ్రమల శాఖ ఆహ్వానిస్తోంది.

తాజా కేటాయింపులతో ప్రతి 4 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఒక ఛార్జింగ్‌ కేంద్రం వచ్చే అవకాశం ఉందన్నది శాఖ అభిప్రాయం. ఒప్పందం కుదిరి, స్థలాలు లభించాయి నిర్థారించాక, ఆయా సంస్థలకు విడతలలో కేటాయింపు పత్రాలు జారీ చేస్తారు. నగర పాలక సంస్థలు, విద్యుత్తు పంపిణీ సంస్థలు, ఇంధన సంస్థలతోనూ ఒప్పందాలుంటాయి. నిర్దేశిత సమయంలో ఇవి నెలకొల్పేలా ప్రభుత్వసంస్థలు చూడాల్సి ఉంది.

state wise
రాష్ట్రాల వారీగా ఇలా..

ఇదీ చూడండి:నెలాఖరులో పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు?

West Tripura (Tripura), Jan 04 (ANI): The Border Security Force (BSF) in a joint crackdown with Directorate of Revenue Intelligence (DRI) has seized 1.68 lakh Myanmar-made Yaba tablets worth Rs 8.5 crore from a house in West Tripura along the Bangladesh border. The operation is said to be the biggest ever in Tripura in terms of the quantity of the narcotic drug and its worth.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.