ETV Bharat / business

3 లేయర్ల మాస్క్ ధర రూ.16 మించొద్దు:కేంద్రం

కరోనావ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మాస్క్‌ల ధరలను నియంత్రించే దిశగా కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మూడు లేయర్ల మెల్ట్‌బౌన్ మాస్క్‌ల ధర రూ.16 దాటొద్దని మాస్క్‌ల తయారీ సంస్థలను ఆదేశించింది.

author img

By

Published : Mar 26, 2020, 6:08 PM IST

center limits on facemask price
మాస్క్‌ల ధరలపై కేంద్రం పరిమితులు

దేశవ్యాప్తంగా కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఫేస్‌మాస్క్‌ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇదే అదునుగా వ్యాపారులు ధరలు పెంచకుండా కేంద్రం చర్యలు ప్రారంభించింది. మూడు లేయర్ల మెల్ట్‌బౌన్‌ ఫేస్‌మాస్క్ ధర రూ.16 మించరాదని స్పష్టం చేసింది. జూన్ 30 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవన్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఇప్పటికే మార్చి 21న రెండు, మూడు లేయర్ల సర్జికల్‌ ఫేస్‌మాస్క్‌ల ధరలు రూ.8, రూ.10 మించరాదని కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితుల్లో హ్యాండ్‌ శానిటైజర్లు, ఫేస్‌మాస్క్‌ల సరఫరాకు అంతరాయం కలగకుండా చూస్తున్నట్లు పవన్ అగర్వాల్ తెలిపారు.

ఇదీ చూడండి:కేంద్రం సంక్షేమ యజ్ఞం- కష్టకాలంలో పేదలకు ఆపన్నహస్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.