ETV Bharat / business

ఎస్​ బ్యాంక్ కేసు: సీబీఐ అదుపులో వాధ్వాన్ సోదరులు - ఎస్​ బ్యాంక్​కేసులో వాద్వాన్ సోదరులపై కేసు

ఎస్​ బ్యాంక్ కేసులో నిందితులు కపిల్​ వాధ్వాన్​, ధీరజ్ వాధ్వాన్​లను సీబీఐ అదుపులోకి తీసుకుంది. మహాబలేశ్వర్​లోని క్వారంటైన్ కేంద్రం నుంచి వారిని తమ కస్టడీలోకి తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు.

kapil wadwan
కపిల్​ వాద్వాన్
author img

By

Published : Apr 26, 2020, 6:35 PM IST

ఎస్​ బ్యాంక్ వివాదంలో వాధ్వాన్​ సోదరుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. డీహెచ్​ఎఫ్​ఎల్ ప్రమోటర్ కపిల్ వాధ్వాన్, ఆర్​కేడబ్ల్యూ డెవలపర్ ప్రమోటర్​ ధీరజ్ వాధ్వాన్లను సీబీఐ అదుపులోకి తీసుకుంది. వారిపై నాన్​ బెయిలబుల్ వారెంటు జారీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఎస్ బ్యాంక్ మాజీ సీఈఓ రానా కపూర్​తో కలిసి వాధ్వాన్​లు పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మార్చి 7న సీబీఐ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది.

లాక్​డౌన్​ ఉల్లంఘన..

ఓ వైపు ఎస్​ బ్యాంక్ వివాదంలో నిందితులుగా ఉన్న వాధ్వాన్ సోదరులపై ఈ నెల ఆరంభంలో లాక్​డౌన్ ఉల్లంఘన అభియోగాలు నమోదయ్యాయి. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధిస్తూ కేంద్రం​ గత నెల కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల ఆరంభంలో వాధ్వాన్ సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి సతారా జిల్లా మహాబలేశ్వర్​లోని వారి ఫామ్​హౌజ్​కు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. లాక్​డౌన్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడకు చేరుకున్నారనే కారణంతో వారిని మహాబలేశ్వర్​లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు అధికారులు.

ఇదే విషయమై సతారా జిల్లా పోలీసులకు సీబీఐ లేఖ రాసింది. తమ అనుమతి లేకుండా వారిని బయటకు వెళేందుకు అనుమతించొద్దని అందులో పేర్కొంది.

ఇదీ చూడండి:వాట్సాప్‌లో జియోమార్ట్​ సేవలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.