లాక్డౌన్ కారణంగా ఏప్రిల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు దాదాపు సగానికి తగ్గాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్లో ఏటీఎంల ద్వారా రూ.1.27 లక్షల కోట్ల నగదు తీసుకున్నారు వినియోగదారులు. మార్చి నెలలో రూ.2.51 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు.
ఆర్బీఐ వెల్లడించిన మరిన్ని విషయాలు..
- ఏటీఎంల ద్వారా లావాదేవీలు ఏప్రిల్లో రూ.28.66 కోట్లకు పడిపోయాయి. మార్చిలో ఇవి రూ.54.71 కోట్లుగా ఉన్నాయి.
- డెబిట్ కార్డుల ద్వారా ఏప్రిల్లో రూ.28.52 కోట్ల లావాదేవీలు జరగ్గా.. మార్చిలో రూ.54.41 కోట్లు జరిగాయి.
- ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 82.94 కోట్ల డెబిట్ కార్డులు, 5.73 కోట్ల క్రెడిట్ కార్డులు (మొత్తం 88.68 కోట్లు కార్డులు) ఉన్నాయి. మార్చిలో మొత్తం కార్డుల సంఖ్య 88.63 కోట్లుగా ఉంది.
- దేశవ్యాప్తంగా ఏప్రిల్ నాటికి మొత్తం 2.34 లక్షల ఏటీఎంలు, 50.85 లక్షల పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినల్స్ ఉన్నాయి.
- పీఓఎస్ల ద్వారా మార్చిలో 33.69 లక్షల లావాదేవీలు (రూ.110 కోట్లు) జరగ్గా.. ఏప్రిల్ నాటికి అవి 40.87 లక్షలకు (రూ.111 కోట్లకు) పెరిగాయి.
ఇదీ చూడండి:ఏటీఎం టచ్ చేయకుండానే క్యాష్ విత్డ్రా!