ETV Bharat / business

క్యాష్​ను మార్చిన కరోనా- 'క్యాష్​లెస్​'కు లేని ధీమా - ప్రపంచదేశాలపై కరోనా ప్రభావం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరెన్సీతోనూ వైరస్ సోకుతుందేమోనన్న భయాలు ఏర్పడుతున్నాయి. దీంతో నగదు రహిత లావాదేవీలు కాస్త ఊపందుకున్నాయి. ఇప్పుడైనా ప్రపంచం మొత్తం 'క్యాష్​లెస్​'గా మారుతుందా? అంటే... సమాధానం లేదు.

coronavirus
కరోనా
author img

By

Published : May 20, 2020, 7:36 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రజా జీవనంలో భారీ మార్పులు వచ్చాయి. కరెన్సీ ద్వారా కరోనా వ్యాపిస్తుందేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. వైరస్ భయాలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల కరెన్సీ వాడకాన్ని తగ్గించారు. నగదు ద్వారా వైరస్ వ్యాప్తి ప్రమాదం తక్కువేనని అధికారులు, వైద్య నిపుణులు చెప్తున్నా.. ఎవరూ పూర్తిగా నమ్మడం లేదు.

'అతి'జాగ్రత్తలా?

వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కరెన్సీ వ్యవహారంపై కొందరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరెన్సీ ఉపయోగించే సమయంలో గ్లౌజులు ధరిస్తున్నారు. వైరస్ చనిపోతుందన్న ఉద్దేశంతో డబ్బులను ఓ చోట ఉంచి కొన్ని రోజులపాటు అలా వదిలేస్తున్నారు. బ్యాంకు నోట్లపై క్రిమి సంహారకాలను జల్లుతున్నారు. ఇంకొందరైతే కరెన్సీ నోట్లను ఏకంగా మైక్రోవేవ్​లో ఉంచి వేడి చేస్తున్నారు.

ఈ అనుమానాల నేపథ్యంలో బ్యాంకులు సైతం ప్రజల సంక్షేమం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చైనాలోని ఓ బ్యాంకు కస్టమర్లకు నగదును అందించే ముందు అందించే ముందు అల్ట్రావైలెట్ కిరణాలను ఉపయోగించి నోట్లను శుభ్రపరుస్తోంది.

నగదుపై కుదరని వేటు!

ఇప్పుటికిప్పుడు ఆర్థిక వ్యవస్థను నగదు రహితంగా మార్చడం సాధ్యమేనా? అంటే కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. స్వీడన్, ఫిన్​లాండ్, నార్వే, కెనడా దేశాలు ఇప్పటికే నగదు రహిత లావాదేవీలకు పెద్దపీట వేశాయి. మరికొద్ది రోజుల్లో యూకే, ఆస్ట్రేలియా దేశాలు పూర్తిగా నగదు రహిత వ్యవస్థలుగా మారనున్నాయి. స్మార్ట్​ఫోన్ ఆధారిత పేమెంట్ సేవలు ప్రారంభమైన తర్వాత చైనాలో నగదు వాడకం తగ్గింది. కానీ మిగతా ప్రపంచ దేశాలది మాత్రం ఒక్కసారిగా నగదుపై వేటు వేయలేని పరిస్థితి.

మానవ ప్రపంచానికి ఈ భౌతిక నగదుతో శతాబ్దాలుగా విడదీయరాని బంధం ఉంది. ఆస్ట్రియా, జర్మనీ దేశాల్లో నగదును ఎంతో ఆదరిస్తారు. 'నగదు చాలా అందమైనది' అంటూ అక్కడ ఓ సామెత కూడా ప్రాచుర్యంలో ఉంది.

వైరస్ తెచ్చిన మార్పు

కానీ, వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి పరిస్థితులు మారుతున్నాయి. గత కొద్ది వారాల వ్యవధిలో తమ దేశంలోని 43శాతం మంది ప్రజలు తమ చెల్లింపు విధానాన్ని మార్చుకున్నట్లు జర్మనీకి చెందిన బుండెస్​ బ్యాంక్​ గణాంకాలు చెబుతున్నాయి. కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసేందుకే ఎక్కువ శాతం ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు బ్యాంకు వెల్లడించింది.

అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇంటర్నేషనల్ కార్డులైన వీసా, మాస్టర్​ కార్డులు ఇరాన్​లో అందుబాటులో లేకుండాపోయాయి. అయినా కొన్ని గ్యాస్ స్టేషన్లలో మాత్రం డెబిట్​ కార్డుల ద్వారా చెల్లించే వారికే సేవలు అందిస్తాం అంటూ బ్యానర్లు వెలిశాయి.

లాక్​డౌన్ కారణంగా తెరిచి ఉన్న కొద్ది పాటి దుకాణాల్లోనూ.. చెల్లింపులు ఆన్​లైన్ ద్వారానే చేయాలని కొనుగోలుదారులకు సూచిస్తున్నారు వర్తకులు.

ఈ దేశాల్లో 'క్యాష్​'దే హవా

నగదుపై అత్యంత నమ్మకం ఉంచే దేశాల్లో జపాన్​ ఒకటి. బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రకారం ఆ దేశ ప్రజల వద్ద ఉన్న ఆస్తుల్లో నగదు వాటా 53శాతం. నగదును తమ వద్ద ఉంచుకోవడం ఓ ఖ్యాతిగా భావిస్తారు అక్కడి ప్రజలు.

మొబైల్ పేమెంట్స్ పుంజుకుంటున్నప్పటికీ పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో ఇప్పటికీ నగదుదే హవా. ఏటీఎంలు ఎప్పుడు పనిచేస్తాయో తెలియదు కాబట్టి చాలా మంది ప్రజలు ఇంట్లోనే నగదు దాచుకుంటున్నారు.

సంక్షోభంలో ఉన్న దేశాలు, ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ పెద్ద ఎత్తున నగదును ఉపయోగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకున్న వెనుజులాలో అయితే వీధుల్లోనూ కరెన్సీ నోట్లు కనిపిస్తాయి.

గతేడాది లెబనాన్​లో ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వల్ల బ్యాంకులు కుప్పకూలిపోతాయేమోన్న ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ప్రజలంతా తమ డబ్బును ఇంట్లోనే దాచుకోవడం ప్రారంభించారు. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అంచనా ప్రకారం.. దాదాపు 3 బిలియన్ డాలర్ల నగదును బ్యాంకుల్లో నుంచి ప్రజలు విత్​డ్రా చేసుకున్నారు.

'క్యాష్​లెస్' సుదూరమే!

కరోనా సంక్షోభం వల్ల నగదు ఉపయోగించే విషయంపై ప్రజలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తారని విచితా స్టేట్ యూనివర్సిటీకి చెందిన లెక్చరర్ డోరోథి హర్పూల్ చెబుతున్నారు. కానీ, నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడానికి ప్రపంచం చాలా దూరంలో ఉందని స్పష్టం చేశారు.

పాలన యంత్రాంగం సరిగాలేని, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో నగదు చాలా విషయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నగదు లేనిదే కొన్ని పనులు చేయలేమని, ప్రభుత్వ అధికారికి క్రెడిట్ కార్డు ద్వారా లంచం ఇవ్వలేం కదా అని అంటున్నారు. ఇలాంటి వాదనలను దాటుకుని... ఆర్థిక వ్యవస్థలు క్యాష్​లెస్​గా ఎప్పటికి మారతాయన్నదే అసలు ప్రశ్న.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.