టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ అదిరే ఆఫర్‌తో ముందుకొచ్చింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ వినియోగదారులకు శుభవార్త ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే 436 రోజుల పాటు ప్రతి రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. ఇంతకీ ఈ ప్లాన్ ఏమిటో తెలుసుకుందామా?
ప్రతిరోజూ 3 జీబీ డేటా
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,999కి... రిపబ్లిక్ డే కానుకగా మరో 71 రోజుల ఆదనపు వ్యాలిడిటీని అందించనుంది. జనవరి 26న అందుబాటులోకి రానున్న ఈ ఆఫర్ ఫిబ్రవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
రూ.1,999 ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఆఫర్ అందుబాటులో ఉండే సమయంలో రీఛార్జ్ చేసుకుంటే ప్లాన్ వ్యాలిడిటీ 436 రోజులకు పెరుగుతుంది. ప్రతిరోజూ 3 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు.
వీటికి తోడు బీఎస్ఎన్ఎల్ టీవీ యాప్ యాక్సెస్ కూడా పొందవచ్చు. మీకు నచ్చిన పాటను రింగ్ టోన్గా పెట్టుకోనూవచ్చు.
మార్కెట్లోనే ది బెస్ట్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 2018 జూన్‌లో ప్రారంభించింది. అప్పుడు రోజుకు 2 జీబీ డేటా మాత్రమే అందించేది. గతేడాది ఈ ప్లాన్‌ను అప్డేట్ చేసి రోజుకు 3 జీబీ డేటా అందిస్తోంది.
జియో రూ.2020 ప్లాన్‌ను రోజుకు 1.5 జీబీ డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసుకోవడానికి 12,000 ఉచిత నిమిషాలు మాత్రమే అందిస్తోంది. వొడాఫోన్, ఎయిర్‌టెల్‌లు తమ తమ రూ.2,398 ప్లాన్లతో రోజూ 1.5 జీబీ డేటాను మాత్రమే అందిస్తున్నాయి.
దీని బట్టి చూస్తే మార్కెట్లో ఉన్న మిగతా నెట్‌వర్క్‌ల ప్లాన్ల కంటే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చాలా మెరుగైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. డేటా పరంగాగానీ, కాలింగ్ పరంగాగానీ మిగతా వాటి కంటే ఈ ప్రస్తుత ప్లాన్ ఉత్తమం.
ఇదీ చూడండి: కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి