ETV Bharat / business

డేటా సెంటర్ల డిమాండ్​తో స్థిరాస్తి రంగం పరుగు!

కరోనా వల్ల స్థిరాస్తి రంగం తీవ్రంగా నష్టపోయింది. అయితే ఇదే సమయంలో డేటా సెంటర్లకు పెరిగిన డిమాండ్.. స్థిరాస్తి రంగానికి కలిసిరానున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తాజా నివేదికలో వెల్లడించింది. లాక్​డౌన్​లో డేటా సెంటర్ల సామర్థ్యం 25-35 శాతం పెరగటమే ఇందుకు ఉదాహరణగా తెలిపింది. డేటా సెంటర్ల వ్యాపారంతో స్థిరాస్తి రంగానికి వార్షికంగా అద్దెల ద్వారా 10-14 శాతం ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

demand rises to data center business
డేటా సెంటర్ల వ్యాపారానికి డిమాండ్
author img

By

Published : Aug 5, 2020, 11:01 AM IST

కొవిడ్​తో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొన్నైతే కొలుకోని విధంగా సంక్షోభంలో చిక్కుకున్నాయి. అందులో స్థిరాస్తి రంగం కూడా ఒకటి. అయితే కరోనా వల్ల కొత్త వ్యాపారాలకూ అవకాశాలు వచ్చాయి. కొవిడ్‌ వల్ల డిజిటిల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల వినియోగం పెరిగింది. దీనివల్ల భారత్​లో డేటా సెంటర్ల వ్యాపారం ఊపందుకుంటోంది. అనరాక్‌ క్యాపిటల్‌ నివేదిక ప్రకారం.. లాక్‌డౌన్‌లో డేటా సెంటర్ల సామర్థ్యం 25-35 శాతం పెరిగినట్లు తెలిసింది.

డేటా సెంటర్ల డిమాండ్ పెరిగేందుకు కారణాలు..

ఆన్‌లైన్‌ తరగతులు, వర్క్‌ ఫ్రం హోం, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం, ఆన్​లైన్ లావాదేవీలు, ఈ-కామర్స్​లో షాపింగ్.. ఇలా ప్రతి ఒక్కటి డేటాకు సంబంధించినదే. కరోనా వల్ల వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా డేటా సెంటర్ల వ్యాపారాలు ఈ స్థాయిలో వృద్ధి చెందినట్లు అనరాక్​ నివేదిక పేర్కొంది.

ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో చైనా తర్వాత భారత్​ రెండో స్థానంలో ఉంది. దేశంలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని డేటా ప్రొటెక్షన్‌ బిల్లు, ఈ కామర్స్‌ పాలసీ ముసాయిదాను తీసుకొచ్చింది ప్రభుత్వం. భారతీయుల డేటాను స్థానికంగా స్టోరేజ్‌ చేసుకోవాలనే విషయాన్ని ఇవి స్పష్టం చేస్తున్నాయి.

స్టార్టప్‌ల పరంగా భారత్​ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. సర్వీసింగ్‌ వ్యాపారంలో దేశ వాటా దాదాపు 55 శాతంగా ఉంది. తదుపరి పారిశ్రామిక విప్లవంగా పరిగణిిస్తున్న ఇండస్ట్రీ 4.0 సాంకేతికతను భారీగా వినియోగించుకోనుంది భారత్​. ఇవన్నీ డిజిటల్‌ భారత్​కు​ దోహదపడుతున్నాయి.

హైదరాబాద్‌లో డిమాండ్‌..

దేశవ్యాప్తంగా డేటా సెంటర్లకు ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో ప్రధానంగా డిమాండ్‌ ఉండనున్నట్లు అనరాక్‌ తెలిపింది.

దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో 75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రస్తుతం డేటా సెంటర్లు ఉన్నాయి. అనరాక్‌ అంచనా ప్రకారం.. వచ్చే 2-3 ఏళ్లలో మరో కోటి లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో డేటా సెంటర్లు పెరగనున్నాయి.

"కొవిడ్‌ మహమ్మారి అన్ని రంగాల్లో డిజిటల్‌ వేదికల వినియోగం పెంచేందుకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ విద్య, వీడియో ఆధారిత మెడికల్‌ కన్సల్టేషన్‌... ఈ-కామర్స్‌, వెబినార్స్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌లలో వృద్ధి.. డేటా సెంటర్లకు డిమాండ్‌ పెరిగేందుకు దోహదపడుతున్నాయి. డేటా స్థానికీకరణ లాంటి ప్రభుత్వ విధానాలు డేటా సెంటర్ల వ్యాపారంలో మంచి భవిష్యత్తును సూచిస్తున్నాయి."

- శోబిత్‌ అగర్వాల్‌, ఎండీ, సీఈఓ, అనరాక్‌ క్యాపిటల్‌.

డేటా సెంటర్ల మార్కెట్​ విలువ..

దేశంలో డేటా సెంటర్ల ప్రస్తుత మార్కెట్​ విలువ దాదాపు రూ.15వేల కోట్లు(2 బిలియన్‌ డాలర్లు). ఇది 25 శాతం వార్షిక వృద్ధితో 2023-24 నాటికి 37.5 వేల కోట్లకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డేటా సెంటర్ల వ్యాపారంలో భారీ అవకాశాలు స్థిరాస్తి పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా మారనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిపై వార్షికంగా 10 నుంచి 14 శాతం అద్దె వస్తుందని అనరాక్‌ అంచనా వేస్తోంది.

డేటా సెంటర్ల వ్యాపారాలను ఇంతకుముందు పరిమిత సంఖ్యలో కంపెనీలు నిర్వహించేవి. అయితే రోజురోజుకూ ఈ వ్యాపారానికి పెరుగుతున్న డిమాండ్​తో అదానీ గ్రూప్‌, హీరానందని గ్రూప్‌, సలపురియా సట్వ, సాలార్పురియా సత్వ, కంట్రోల్‌ఎస్‌ , ఎన్‌టీటీ వంటి సంస్థలూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇదీ చూడండి:'అప్పుల ఊబి దౌత్యం'తో చైనా వడ్డీ వ్యాపారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.