ETV Bharat / business

50,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ - elon musk

బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ అంచనాలను మించి పెరిగిపోతోంది. ఏడాది క్రితం 10వేల డాలర్లుగా ఉన్న బిట్​కాయిన్​.. ప్రస్తుతం 50వేల డాలర్లకు చేరింది.

bitcoin value reaches 50 thousand dollars
50,000 డాలర్లకు బిట్‌కాయిన్‌
author img

By

Published : Feb 17, 2021, 6:37 AM IST

బిట్‌కాయిన్‌ విలువ రోజుకో కొత్త రికార్డును బద్దలుకొడుతూ దూసుకెళ్తోంది. మంగళవారం ఈ డిజిటల్‌ కరెన్సీ విలువ చరిత్రలో తొలిసారిగా 50,000 డాలర్ల మైలురాయిని అధిగమించింది. ఏడాది క్రితం బిట్‌కాయిన్‌ విలువ 10000 డాలర్ల దరిదాపుల్లోనే ఉండటం గమనార్హం. అయితే గత మూడు నెలల్లోనే దీని ధర దాదాపు 200 శాతం పెరిగింది.

బిట్‌కాయిన్‌లో 150 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడం సహ కొనుగోలుదార్ల నుంచి బిట్‌కాయిన్‌ చెల్లింపులు స్వీకరించే యోచనలో ఉన్నామని గతవారం ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లా ప్రకటించింది. దీంతో క్రిప్టో కరెన్సీ పరుగు మరింత వేగవంతమైంది. చట్టబద్ధమైన చెల్లింపులకు మరిన్ని కంపెనీలు బిట్‌కాయిన్‌ను అంగీకరించొచ్చన్న అంచనాలు తాజా పరుగుకు కారణమవుతున్నాయి. కొన్ని కారణాల వల్ల సంప్రదాయ బ్యాంకింగ్‌ వ్యవస్థలను ఇష్టపడని పార్టీల కోసం, కంపెనీలు బిట్‌కాయిన్‌ వైపు చూస్తున్నాయి.

బిట్​కాయిన్ వృద్ధి ఇలా..

సంవత్సరంనెలవిలువ (డాలర్లలో)
2011ఫిబ్రవరి1
2011జూన్​10
2013ఏప్రిల్100
2013నవంబర్1,000
2017అక్టోబర్5,000
2017నవంబర్10,000
2017డిసెంబర్15,000
2020డిసెంబర్20,000
2020డిసెంబర్25,000
2021జనవరి30,000
2021జనవరి35,000
2021జనవరి40,000
2021ఫిబ్రవరి45,000
2021ఫిబ్రవరి50,000

ఇదీ చూడండి: బిట్​కాయిన్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.