జనరిక్ ఔషధాలను బ్రెజిల్లో విక్రయించటానికి వీలుగా బయోకాన్ లిమిటెడ్, బ్రెజిల్‌కి చెందిన లిబ్స్ ఫార్మాసూటికాన్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం జనరిక్ ఔషధాలపై పరిశోధన, అభివృద్ధి, తయారీ కార్యకలాపాలను బయోకాన్ నిర్వహిస్తుంది. వాటిని బ్రెజిల్లో విక్రయించే బాధ్యతలను లిబ్స్ ఫార్మాసూటికా చేపడుతుంది.
లిబ్స్తో తమకు 2017 నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నట్లు బయోకాన్ లిమిటెడ్ సీఈఓ సిద్ధార్థ్ మిట్టల్ వివరించారు. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే బయోసిమిలర్ ఔషధమైన ట్రస్టుజుమ్యాబ్ను గత నాలుగేళ్లుగా బ్రెజిల్‌కు బయోకాన్ అందస్తోంది. బ్రెజిల్లో లిబ్స్ ఫార్మాసూటికా ద్వారా విక్రయిస్తున్న ఈ ఔషధానికి ప్రైవేట్ మార్కెట్లో అధిక మార్కెట్ వాటా ఉంది.
ఇదీ చదవండి: సైరస్ మిస్త్రీ వివాదంలో టాటా సన్స్‌కు ఊరట