ETV Bharat / business

‘కొవాగ్జిన్‌’కు ఫిలిప్పీన్స్‌లో అనుమతి కోరిన భారత్‌ బయోటెక్‌?

విదేశాల్లో కొవాగ్జిన్​ అత్యవసర వినియోగ అనుమతులు తీసుకోడానికి భారత్​ బయోటెక్​ ప్రయత్నాలు చేపట్టింది. నిబంధనల మేరకు క్లినికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరే అవకాశం ఉంది. భారత్‌ బయోటెక్‌ నుంచి టీకా తీసుకోడానికి బ్రెజిల్‌ ఇప్పటికే ఆసక్తి వ్యక్తం చేసింది.

author img

By

Published : Jan 22, 2021, 6:53 AM IST

bharat biotech
bharat biotech

కొవిడ్‌-19 టీకా, ‘కొవాగ్జిన్‌’ను విదేశాల్లో విక్రయించడానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సన్నాహాలు చేస్తోంది. కొన్ని దేశాల్లో ‘అత్యవసర వినియోగ’ అనుమతులు తీసుకోడానికి, నిబంధనల మేరకు క్లినికల్‌ పరీక్షలు నిర్వహించే ప్రయత్నాలు చేపట్టింది. మనదేశంలో ‘కొవాగ్జిన్‌’ కు అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) లభించిన విషయం తెలిసిందే. ఇదేవిధంగా ఫిలిప్పీన్స్‌లో అత్యవసర వినియోగ అనుమతి కోసం భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేసింది. బంగ్లాదేశ్‌లో క్లినికల్‌ పరీక్షలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తదుపరి అక్కడా అనుమతి కోరే అవకాశం ఉంది.

నాలుగు సంస్థల యత్నాలు

ఫిలిప్పీన్స్‌లో ‘కొవాగ్జిన్‌’ టీకాకు అనుమతి కోసం ఫిలిప్పీన్స్‌ ఎఫ్‌డీఏ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌) కు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేసినట్లు, ఫిలిప్పీన్స్‌ ఎఫ్‌డీఏ చీఫ్‌ రొలాండో ఎన్‌రిక్‌ డొమింగో వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌లో కొవిడ్‌-19 టీకాకు అనుమతి కోసం ఇప్పటికే ఫైజర్‌-బయాన్‌టెక్‌, ఆక్స్‌ఫర్డ్‌ -ఆస్ట్రజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ దరఖాస్తు చేయగా, భారత్‌ బయోటెక్‌ నాలుగోది.

బంగ్లాదేశ్‌లో క్లినికల్‌ ట్రయల్​కు సన్నాహాలు

పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో ‘కొవాగ్జిన్‌’ టీకాపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్‌, ఢాకాలోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డయేరియల్‌ డిసీజ్‌ రీసెర్చ్‌- బంగ్లాదేశ్‌ (ఐసీడీడీఆర్‌-బి) అనే సంస్థతో భాగస్వామ్యం కుద్చుకున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అనుమతిస్తే, ‘కొవాగ్జిన్‌’ పై క్లినికల్‌ పరీక్షలను ఆ సంస్థ నిర్వహిస్తుంది. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ తరఫున ఆ సంస్థ బంగ్లాదేశ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ దరఖాస్తును అక్కడి ‘ఎథిక్స్‌ కమిటీ’ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. క్లినికల్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే బంగ్లాదేశ్‌లో అత్యవసర వినియోగ అనుమతి కోసం భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేస్తుందని తెలుస్తోంది.

మార్చికల్లా దేశీయ సమాచారం

‘కొవాగ్జిన్‌’ పై మనదేశంలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల సమాచారం ఈ ఏడాది మార్చి నాటికి లభిస్తుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి అనుమతితో కొవాగ్జిన్‌ టీకాను విక్రయించే అవకాశం ఉంటుంది. భారత్‌ బయోటెక్‌ నుంచి టీకా తీసుకోడానికి బ్రెజిల్‌ ఇప్పటికే ఆసక్తి వ్యక్తం చేసింది. మరికొన్ని దేశాలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి : మరో 45 లక్షల డోసుల కొవాగ్జిన్​ కొనుగోలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.