ETV Bharat / business

'అందుకే వ్యాక్సిన్​ పంపిణీకి బ్రేక్' - కొవాగ్జిన్ టీకాలు

కొవాగ్జిన్ టీకా కొనుగోళ్లను బ్రెజిల్ నిలిపేయాలని చూస్తున్నట్లు వస్తున్న వార్తలపై భారత్​ బయోటెక్ స్పందించింది. బ్రెజిల్​ తమకు ముందస్తు చెల్లింపులు చేయలేదని.. అందుకే కొవాగ్జిన్ టీకా డోసులు పంపిణీ చేయలేదని పేర్కొంది.

covaxin
కొవాగ్జిన్
author img

By

Published : Jun 30, 2021, 1:27 PM IST

బ్రెజిల్.. కొవాగ్జిన్ టీకా కొనుగోళ్లను నిలిపేయాలని భావిస్తోందంటూ వస్తున్న వార్తలపై భారత్ బయోటెక్ స్పందించింది. ఇప్పటి వరకు బ్రెజిల్ తమకు ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయలేదని.. అందుకే కొవాగ్జిన్ డోసులను పంపిణీ చేయలేదని పేర్కొంది.

"సాధారణంగా వ్యాక్సిన్ల కోసం ఆయా దేశాల వైద్య ఆరోగ్య శాఖ.. టీకా ఉత్పత్తి చేస్తున్న సంస్థలతో ముందుగా ఒప్పందం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆయా దేశాల్లో అత్యవసర వినియోగం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాక. వ్యాక్సిన్​ పంపిణీ చేస్తాం. ఇందుకోసం ఆయా దేశాలు ముందస్తుగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే యూఎస్ , ఈయూ.. లాంటి అనేక దేశాలు ముందస్తు ఒప్పందం చేసుకుని ఆర్డర్లు ఇచ్చాయి. మరికొన్ని దేశాల్లో అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం."

-- భారత్ బయోటెక్

గతేడాదే ఒప్పందం..

ఇక బ్రెజిల్​కు వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి గతేడాది నవంబర్​లోనే ఒప్పందం చేసుకోగా .. అందులో ఒక్కో డోస్ ధర 15 డాలర్లుగా నిర్ణయించామని భారత్​ బయోటెక్ స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది జూన్ 29 వరకు ఆ దేశంలో అనుమతుల కోసం దశలవారీగా ప్రయత్నాలు చేయగా ఇటీవలే అత్యవసర వినియోగానికి అనుమతి లభించినట్టు పేర్కొంది.

అయితే ఇప్పటి వరకు తమకు ముందస్తు చెల్లింపులు జరగలేదని.. దీంతో బ్రెజిల్​కు టీకాలు ఇంకా అందించలేదని పేర్కొంది. ప్రస్తుతం బ్రెజిల్​లో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా సాగుతున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి : కొవిడ్ బాధితుల్లో కొత్త ఇన్​ఫెక్షన్​.. ఒకరు మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.