ETV Bharat / business

వాతావరణ మార్పులపై పోరాడేందుకు 'అమెజాన్'​ భారీ సాయం - latest climate change news

ప్రముఖ ఆన్​లైన్​ మార్కెట్​ దిగ్గజం అమెజాన్​ సంస్థ కీలక ప్రకటన చేసింది. వాతావరణ మార్పులపై పోరాడేందుకు 10 బిలియన్​ డాలర్ల సాయం ప్రకటించింది. ఇదే విషయాన్ని సంస్థ సీఈఓ జెఫ్​ బెజోస్​ ఇన్​స్టా వేదికగా వెల్లడించారు.

Bezos launches USD 10 bn fund to combat climate change
పర్యావరణ సమస్యలపై పోరాడెందుకు 'అమెజాన్'​ అడుగులు
author img

By

Published : Feb 18, 2020, 11:56 AM IST

Updated : Mar 1, 2020, 5:11 PM IST

వాతావరణ మార్పులపై సరైన చర్యలు తీసుకోవట్లేదని.. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆన్​లైన్​ మార్కెట్​ దిగ్గజం అమెజాన్​.. తాజాగా కీలక ప్రకటన చేసింది. వాతావరణ మార్పులను అరికట్టేందుకు 10బిలియన్​ డాలర్లను కేటాయింస్తున్నట్లు సంస్థ సీఈఓ జెఫ్​ బెజోస్​ తెలిపారు.

ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు బెజోస్. పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, ఎన్జీఓలకు ఈ నిధులను అందిస్తామని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు రావడం చాలా ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.

వాతారవణ మార్పులు అనేది భూగోళానికి అత్యంత పెద్ద సమస్య. వాతావరణంలో నెలకొన్న విపత్కర మార్పులను ఎదుర్కొనేందుకు పోరాడాలనుకుంటున్నా. అందుకు కావాల్సిన మార్గాలను అన్వేషించడానికి నిపుణులతో కలిసి పనిచేయాలని భావిస్తున్నా.

- జెఫ్​ బెజోస్​, అమెజాన్​ సీఈఓ

సంస్థ పాలసీలపై విమర్శలు..

ఇటీవల సంస్థ విధానాలను విమర్శిస్తూ.. వందలాది మంది అమెజాన్​ ఉద్యోగులు.. సంస్థ బ్లాగ్​లో పోస్ట్​ చేశారు. వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్​ చేశారు. డోర్​ డెలివరీల కోసం అమోజాన్​ ఉపయోగించే ప్యాకేజింగ్​ వల్ల ఎక్కువ వ్యర్థాలు వెలువడుతున్నాయని ఆరోపించారు. అంతే కాకుండా భారీ వాహనాల నుంచి గ్రీన్​హౌస్​ వాయు ఉద్గారాలు అధికంగా ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెజోస్​ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

2040 నాటికి పర్యావరణంలో కార్బన్ సమతుల్యత సాధిస్తామని గతేడాది సెప్టెంబరులో ప్రకటించారు బెజోస్​. అంతే కాకుండా లక్ష ఎలక్ట్రిక్​ డెలివరీ ట్రక్కులను ఆర్డర్​ చేస్తామని పేర్కొన్నారు.

Last Updated : Mar 1, 2020, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.