ETV Bharat / business

ఏప్రిల్​ 1తో ముగియనున్న ఆంధ్రా బ్యాంక్​ ప్రస్థానం - నిర్మలా సీతారామన్ న్యూస్​

10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించే.. మెగా విలీన ప్రక్రియ ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయా బ్యాంకులు వీలీన ప్రక్రియను ముమ్మరం చేసినట్లు తెలిపారు.

Banks' merger to come into effect from Apr 1
10 ప్రభుత్వ బ్యాంకుల విలీనం ఏప్రిల్​ 1 నుంచే అమలు
author img

By

Published : Mar 4, 2020, 7:33 PM IST

ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం ఏప్రిల్​ 1 నుంచే అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా కుదించాలని కేంద్రం గతేడాది ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. విలీన విషయమై బ్యాంకులతో ఎప్పటికప్పుడు కేంద్రం మంతనాలు జరుపుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకుల బోర్డులు అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నాయన్నారు.

ఈ మెగా విలీనానికి నియంత్రణ పరమైన ఎలాంటి సమస్యలు లేవని సీతారామన్ స్పష్టం చేశారు.

బ్యాంకుల విలీనం ఎందుకు?

బ్యాంకుల మెగా విలీనాన్ని 2019 ఆగస్టులో ప్రతిపాదించింది ప్రభుత్వం. దేశంలో ప్రపంచస్థాయి బ్యాంకులను తయారు చేసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కించేందుకు విలీనమే పరిష్కారంగా కేంద్రం యోచిస్తోంది.

బ్యాంకుల విలీన ప్రతిపాదన ఇలా..

  • పంజాబ్​ నేషనల్ బ్యాంకులో.. ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ కామర్స్, యునైటెడ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కలిపి రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా మార్చాలని నిర్ణయించింది కేంద్రం.
  • కెనరా బ్యాంకులో.. సిండికేట్ బ్యాంక్​ను విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఇదే జరిగితే కెనరా బ్యాంకు 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది.
  • యూనియన్ బ్యాంకులో.. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలీనం పూర్తయితే యూనియన్ బ్యాంక్​ 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తయారవుతుంది.
  • ఇండియన్​ బ్యాంకులో.. అలహాబాద్​ బ్యాంకును విలీనం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఈ విలీనం పూర్తయితే దేశంలో 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇండియన్ బ్యాంకు అవతరిస్తుంది.

ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగానే బ్యాంకుల విలీనం పూర్తయితే దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి.

ఇదీ చూడండి:గందరగోళం మధ్య 'వివాద్​ సే విశ్వాస్​'కు లోక్​సభ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.