కొవిడ్ మహమ్మారి (Covid-19) కారణంగా ఉత్పత్తి సగానికి పడిపోయి... కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పడిపోయి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆటోరంగం (Auto Sales) ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆంక్షల ఎత్తివేత, కొవిడ్ కారణంగా పర్సనల్ వెహికిల్స్ వైపునకు మొగ్గుచూపటం, కొత్త లాంచ్‌లు, కొనుగోలుదారుల ఆసక్తి పెరగటం.. అన్ని కలగలిపి దేశవ్యాప్తంగా కొత్తవాహనాల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో కొనుగోలు దారులు షోరూంలకు వాకిన్లు, బుకింగ్‌లు పెరిగి ఇండస్ట్రీ రీవైవల్ దిశగా పరుగులు తీస్తోంది.
షోరూంల కళకళ...
ఇంతలోపే ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్ చిప్(Semi Conductor Chip)ల కొరత ఆటోరంగానికి (Auto Sales) అతిపెద్ద సవాల్‌ను విసురుతోంది. దీంతో కొనుగోలుదారుల డిమాండ్ మేరకు కొత్తవాహనాల డెలివరీలు చేయలేక డీలర్లు దిగాలు చెందుతున్నారు. పండుగ సీజన్ ఈ ఒత్తిడి నుంచి కాస్త ఊరటనిస్తోంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులను షోరూంల బాట పట్టేలా చేసి అమ్మకాలతో కళకళలాడేలా చేస్తున్నాయి.
పండుగ సందర్భంగా...
సెప్టెంబర్ నెలలో కొత్త వాహనాల అమ్మకాలు 40 శాతం పడిపోయాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్-సియామ్ తెలిపింది. కొత్త వాహనాల తయారీలో కీలకమైన సెమికండక్టర్ చిప్‌ల కొరతతో మారుతి సుజూకి, మహీంద్రా, కియా వంటి ప్రముఖ కార్ కంపెనీల తమ ఉత్పత్తిని యాభై శాతానికి కట్ డౌన్ చేశాయి. దీంతో కస్టమర్లు నూతన మోడళ్ల బుకింగ్‌లు నెలలకొద్దీ ఆలస్యమవుతోందని వారు చెబుతున్నారు. చిప్‌ల సమస్యలేని ఇతర కార్ల అమ్మకాల విక్రయాలు బాగున్నాయని.. ముఖ్యంగా పండుగ సందర్భంగా కస్టమర్ల వాకిన్లు పెరిగాయని డీలర్లు చెబుతున్నారు.
రాబోయే రోజుల్లోనూ...
దీనికి కొత్త కార్ మోడళ్ల ఆవిష్కరణలు సీజన్‌కు అదనపు ఉత్తేజాన్ని తీసుకువచ్చాయని అంటున్నారు. గతేడాది దసరాతో పోలిస్తే 30 శాతం అధికంగా మార్కెట్ జరిగిందని వారు తెలిపారు. పండుగ సీజన్ కార్ల అమ్మకాలకు ఎప్పుడూ పెద్ద ప్లస్సే అని.. రాబోయే దీపావళి, ఇయర్ ఎండింగ్ సేల్స్‌లోనూ ఈ ప్రభావం కనిపిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ఈసారి కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంది. డిమాండ్ అయితే బాగానే ఉంది. ట్రెండ్ చూస్తే.. టూవీలర్ ఇండస్ట్రీ 30 శాతం డ్రాప్లో ఉంది. కార్ల వరకు డిమాండ్ అయితే బానే ఉంది. బుకింగ్స్ బాగా వచ్చాయి. కానీ 50 శాతం మాత్రమే మ్యానుఫ్యాశ్చర్ చేయగలుగుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సేల్స్ బాగా పెరిగాయి. గత రెండు సంవత్సరాల నుంచి చూస్తే ఈ ఏడాది సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. వినియోగదారుల నుంచి రెస్పాన్స్ బాగుంది. సెమికండక్టర్స్ సమస్య వల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేకపోయాం. లేకపోతే ఇంకా ఎక్కువ సందడిగా ఉండేది.
-- ఆటోసేల్స్ ప్రతినిధులు
ఇవీ చదవండి: