కరోనాతో ఇప్పటికే తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న విమాన సంస్థలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను భారీగా పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ఏటీఎఫ్ ధర కిలో లీటర్‌పై (దిల్లీలో) మంగళవారం రూ.5,494.5 (16.3 శాతం) పెంచాయి. తాజా పెంపుతో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.39,069.87 వద్దకు చేరింది.
ఏటీఎఫ్ ధరలు పెంచడం ఈ నెలలో ఇది రెండో సారి. ఇంతకు ముందు జూన్ 1న అత్యధికంగా కిలో లీటర్ ఏటీఎఫ్ ధర 56.5 శాతం (రూ.12,126.75) పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. ప్రతినెల 1వ తేదీన, 16వ తేదీన ఏటీఎఫ్ ధరలు సవరించడం ఆనవాయితీగా వస్తోంది.
ఫిబ్రవరి నుంచి వరుసగా 7 సార్లు.. డిమాండ్ లేమి కారణంగా ఏటీఎఫ్ ధరలను తగ్గిస్తూ వచ్చిన విషయం విధితమే.
ఇదీ చూడండి:పదో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర