ETV Bharat / business

కరోనా పంజా​: విమానయాన రంగానికి 2 లక్షల కోట్ల నష్టం!

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్​ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధానంగా చైనాకు రాకపోకలను నిలిపేశాయి ఇతర దేశాలు. ఫలితంగా విమానయాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయని తెలిపింది అంతర్జాతీయ వాయు రవాణా సంఘం.

iata
కరోనా ఎఫెక్ట్
author img

By

Published : Feb 21, 2020, 1:59 PM IST

Updated : Mar 2, 2020, 1:48 AM IST

కరోనా వైరస్​ సంక్షోభం నేపథ్యంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సేవలందిస్తున్న విమానయాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. వైరస్​ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోనున్నట్లు అంచనా వేసింది అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ).

చైనాలో కరోనా వైరస్​ ప్రభావం కారణంగా వాయు రవాణా డిమాండ్ 13 శాతం పడిపోయిందని ఐఏటీఏ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని సాధ్యమైనంత త్వరగా అడ్డుకోవాలని.. లేదంటే వాయు రవాణాలో తీవ్రమైన సంక్షోభం తలెత్తుతుందని అభిప్రాయపడింది. ఇప్పటికే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన సంస్థలు 1.5 బిలియన్ డాలర్లు నష్టపోయాయని తెలిపింది.

రెండు దశాబ్దాల క్రితం సార్స్​ తరహాలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఫలితంగా చైనా దేశీయ మార్కెట్​ సుమారు 12.8 బిలియన్​ డాలర్ల నష్టపోనుందని అంచనా వేసింది ఐఏటీఏ. 2008-09 ఆర్థిక సంక్షోభం తర్వాత అంతగా డిమాండ్ తగ్గిపోవటం ఇదే మొదటిసారని పేర్కొంది.

తిరోగమన వృద్ధి!

ఆసియా పసిఫిక్ విమానయాన సంస్థలు ఈ ఏడాది 4.8 శాతం వృద్ధి సాధిస్తాయని ఐఏటీఏ అంచనా వేసింది. కానీ ప్రస్తుత సంక్షోభంతో 8.2 శాతం తిరోగమనంలో ఉందని విశ్లేషించింది. వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే ఆసియా పసిఫిక్​తో పాటు ప్రపంచంలోని అన్ని సంస్థలపై ప్రభావం పడనుంది.

అయితే ప్రభుత్వాలు కొన్ని ఉద్దీపన చర్యలు చేపడితే నష్టాల నుంచి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని ఐఏటీఏ పేర్కొంది.

"ఆర్థిక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి ద్రవ్య విధానాలను ప్రభుత్వాలు సవరిస్తాయి. కొన్ని విమానయాన సంస్థలకు ఇంధన ధరలు తగ్గితే కొంత ఉపశమనం లభిస్తుంది. నష్టాలను నివారించుకునేందుకు విమానయాన సంస్థలు ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సామర్థ్యం, రూట్లను తగ్గిస్తున్నాయి."

-ఐఏటీఏ

ఇదీ చూడండి: కరోనా: చైనాలో తగ్గుముఖం.. మరి ఇతర దేశాల పరిస్థితి?

Last Updated : Mar 2, 2020, 1:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.