ETV Bharat / business

'బ్లాక్​రాక్​' మాల్​వేర్​తో బ్యాంకింగ్​ డేటా ఉఫ్​ - ఆండ్రాయిడ్​ మాల్​వేర్​

బ్లాక్​రాక్​ అనే ఆండ్రాయిడ్​ మాల్​వేర్​తో​ ముప్పు పొంచి ఉందని సైబర్​ సెక్యూరిటీ సంస్థ సీఈర్​టీ-ఇన్​ భారతీయులను హెచ్చరించింది. దీని ముందు ఎలాంటి యాంటీ-వైరస్​లు పనిచేయడం లేదని.. వివిధ యాప్​ల నుంచి వినియోగదారుల బ్యాంకింగ్​, క్రెడిట్​ కార్డు వివరాలను దొంగిలించే సామర్థ్యం దీనికి ఉందని వెల్లడించింది.

Android malware 'BlackRock' prowling in cyber space, may steal banking data: Advisory
'బ్లాక్​రాక్​' మాల్​వేర్​తో బ్యాంకింగ్​ డేట ఉఫ్​
author img

By

Published : Jul 30, 2020, 5:57 PM IST

దేశానికి ఆండ్రాయిడ్​ మాల్​వేర్​ "బ్లాక్​రాక్​" ముప్పు పొంచి ఉందని సైబర్​ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది. ఈ బ్లాక్​రాక్​.. వినియోగదారుల బ్యాంకింగ్​ వివరాలు సహా ఇతర రహస్య సమాచారాలను దొంగిలించగలదని పేర్కొంది.

ఈ-మెయిల్​, ఈ-కామర్స్​ యాప్​లు, సామాజిక మధ్యమాల యప్​లతో పాటు బ్యాంకింగ్​- ఆర్థిక యాప్​లు సహా 300లకుపైగా యాప్​ల నుంచి వినియోగదారుల క్రెడిట్​ కార్టుల వివరాలను ఈ బ్లాక్​రాక్​ పొందగలదని 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్'‌(సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరించింది. ట్రోజన్​ కేటగిరిలోని ఈ వైరస్​.. ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్​గా ఉందని వెల్లడించింది.

"పరికరంలో మాల్​వేర్​ పని చేయడం ప్రారంభించిన అనంతరం.. దాని ఐకాన్​ కనుమరుగవుతుంది. ఆ తర్వాత నకిలీ గూగుల్​ అప్​డేట్​గా ప్రత్యక్షమవుతుంది. అనుమతి కోసం వినియోగదారుడిని అడుగుతుంది. ఒక్కసారి అనుమతిస్తే.. మరికొన్ని అనుమతులు దాని అంతట అదే పొందుతుంది. వినియోగదారుడితో సంబంధం లేకుండా అనేక ముఖ్యమైన విషయాలకు స్వయంగా అనుమతులు ఇచ్చుకుంటుంది. ఆ తర్వాత వినియోగదారుడి బ్యాంకింగ్​ వివరాలను దోచుకుంటుంది."

--- సీఈఆర్​టీ-ఇన్​ ప్రకటన

ఇదీ చూడండి:- ఇంటి నుంచి పనిచేస్తున్నారా.. ఐతే జాగ్రత్త!

ఈ వైరస్​ ఎంతో ప్రమాదకరమని.. యాంటీ-వైరస్​ యాప్​లు కూడా దీని ముందు పనికిరావడని సీఈఆర్​టీ పేర్కొంది. ఈ మేరకు పలు సూచనలు జారీ చేసింది.

  • అనుమానాస్పద యాప్​లను డౌన్​లోడ్​ చేసుకోవద్దు. మార్కెట్​లో మంచి గుర్తింపు ఉన్న వాటినే ఇన్​స్టాల్​ చేసుకోవాలి.
  • యాప్​ వివరాలను సమీక్షించాలి. ప్లే స్టోర్​లో డౌన్​లోడ్​ చేసుకునే ముందు.. డౌన్​లోడ్​ల సంఖ్య, వినియోగదాల అభిప్రాయాలు, అదనపు సమాచారాలను చూడాలి.
  • డౌన్​లోడ్​ కోసం తెలియని వైఫై నెట్​వర్క్​ కాకుండా.. డివైజ్​ ఎన్​క్రిప్షన్​, ఎస్​డీ కార్డు వాడండి.
  • బ్యాంకింగ్​ యాప్​లకు సంబంధించి అధికారికమైన వాటినే వినియోగించాలి.

ఇదీ చూడండి:- 'జోకర్​'తో జరభద్రం- లేదంటే ఖాతా ఖాళీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.