బీమా చేయించుకోవాలంటే పాలసీ తీసుకోవాలి. అదే పెట్టుబడి పెట్టేందుకు... మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, డెట్ ఫండ్స్ ఇలా అనేక సాధనాలున్నాయి. రెండు ప్రయోజనాలు ఒకే సాధనంలో అందేందుకు ఉద్దేశించినదే... యూలిప్( యూనిట్ లింక్ డ్ ఇన్సూరెన్స్ పాలసీ).
బీమా+పెట్టుబడులు
ఇందులో పాలసీదారు చెల్లించే ప్రీమియంలో కొంత మొత్తం బీమా కోసం, మిగతా మొత్తం పెట్టుబడికి వెళ్తుంది. ఈ పెట్టుబడి సాధారణ మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి తరహాలో ఉంటుంది. 5,10, 15 సంవత్సరాలు... ఇలా తీసుకున్న పాలసీ కాలానికి తగ్గట్లు మ్యూచువల్ ఫండ్ల యూనిట్లలో పెట్టుబడులు జమ అవుతాయి.
పాలసీదారు పెట్టుబడి కోసం ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్డ్ ఫండ్లను ఎంచుకునే సౌకర్యం ఇందులో ఉంటుంది. డెట్, ఈక్విటీ మధ్య పెట్టుబడులను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ల తరహా కాకుండా... యూలిప్లలో ప్రీమియం అలకేషన్, మోర్టాలిటీ, ఫండ్ మేనేజర్ తదితర ఛార్జీలుంటాయి.
మినహాయింపులు, ఛార్జీలు..
యూలిప్లో పెట్టుబడులకు 80సీ ప్రకారం ఆదాయపు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అంతే కాకుండా సెక్షన్ 10(10డీ) ప్రకారం మెచ్యురిటీ కాలం తర్వాత వచ్చిన రిటర్న్‌లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది.
ఇదీ చూడండి: మాంద్యానికి మౌలిక చికిత్స.. పెట్టుబడుల మంత్రం ఫలిస్తుందా?