కరోనా రెండో దశ సంక్షోభం నేపథ్యంలో తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు పర్యాటకం, విమానయానం, ఆతిథ్య రంగాలకు ఉద్దీపనలు ప్రకటించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(పీహెచ్‌డీసీసీఐ) కూడా ప్యాకేజీ విషయమై కేంద్రానికి అభ్యర్థనలు చేసింది. ఈ సందర్భంగా వృద్ధికి ఊతమిచ్చేలా 17 సిఫార్సులు చేసింది.
"రెండో దశలో కరోనా తొలి దశకంటే వేగంగా వ్యాపిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటిపైనా ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాణిజ్య వ్యాపారాలను ఆదుకునేందుకు ప్రాధాన్యమైన ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలి" అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో కోరింది. ఇక.. మహమ్మారి ఉద్దృతితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయే అవకాశముందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఇవీ చదవండి: మస్క్ ట్వీట్ జోష్- బిట్‌కాయిన్ 19% జంప్!