ETV Bharat / business

అమెజాన్​ ప్రైమ్​లో​ 'వీడియో ఛానల్స్'​- ఇక మరింత వినోదం! - అమెజాన్​ ప్రైమ్​

భారత్​లో అమెజాన్(amazon india)​ జోరు పెంచింది. అమెజాన్​ ప్రైమ్​తో ఒరిజినల్​ కంటెంట్​ను అందిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సంస్థ.. తాజాగా 'ప్రైమ్​ వీడియో ఛానల్స్​'(prime video channels)ను దేశంలో ప్రవేశపెట్టింది. ఈ ప్రైమ్​ వీడియో ఛానల్స్​ విశేషాలేంటో మీరూ చూసేయండి.

amazon prime video channels
అమెజాన్​ ప్రైమ్​ వీడియో ఛానెల్స్​
author img

By

Published : Sep 24, 2021, 5:37 PM IST

'ప్రైమ్​ వీడియో ఛానల్స్​'ను(prime video channels) దేశంలో ఆందుబాటులోకి తీసుకొచ్చింది అమెజాన్​(amazon india). దీంతో డిస్కవరీ ప్లస్​, ఈరోస్​ నౌ వంటి ఛానల్స్​.. ఒకే వేదికపైకి చేరాయి.

అమెజాన్​.. ప్రైమ్​ వీడియో ఛానల్స్​ తీసుకొచ్చిన దేశాల్లో 12వది భారత్. ఇప్పటికే వివిధ రకాల కంటెంట్​ను అందిస్తోంది ప్రైమ్​.. తాజా ప్రకటనతో అనేక ఛానల్స్​ను 'యాడ్​ఆన్​ సబ్​స్క్రిప్షన్స్​'గా యూజర్స్​కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే.. ఎవరైనా యాడ్​ఆన్​ ఆప్షన్​ను ఎంచుకుంటే, వారికి ఆమెజాన్​ ప్రైమ్​లోనే ఆయా ఛానల్స్​ కంటెంట్​ కనపడుతుంది.

"10 భాషల్లో యూజర్స్​కు వినోదం అందించేందుకు నాలుగేళ్లుగా మేము కృషి చేస్తూనే ఉన్నాము. భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసలుసిసలైన కంటెంట్​ను ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నాము. ప్రైమ్​ వీడియో ఛానల్​ను దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా.. భారతీయ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తున్నాము."

--- గౌరవ్​ గాంధీ, అమెజాన్​ ప్రైమ్​ వీడియో ఇండియా మేనేజర్​.

యాడ్​ఆన్​ సబ్​స్క్రిప్షన్స్​.. ధరలు..

ప్రైమ్​ వీడియో ఛానల్స్​ ద్వారా.. 8 ఓటీటీ సంస్థలకు చెందిన దాదాపు 10వేలకుపైగా కంటెంట్​లు ప్రైమ్​లో యూజర్స్​కు అందుబాటులోకి వచ్చాయి(amazon india app).

డిస్కవరీ ప్లస్(రూ. 299)​, ఈరోస్​ నౌ(రూ. 299)తో పాటు లయన్స్​గేట్​ ప్లే(రూ. 699), డాక్యుబే(రూ. 499), మూబీ(రూ. 1,999), హొయిచాయ్​, షార్ట్స్​టీవీ(రూ. 299), మనోరమా-మ్యాక్స్​(రూ. 699) కూడా అమెజాన్​ ప్రైమ్​లో దర్శనమివ్వనున్నాయి. తమకు నచ్చినవి ఎంచుకోవచ్చని, ఆ సేవలకు తగ్గట్టుగానే పేమెంట్​ చేయవచ్చని అమెజాన్​ పేర్కొంది.

ఇదీ చూడండి:- అమెజాన్​ ప్రైమ్ నెలవారీ ప్లాన్​, ఫ్రీ ట్రయల్‌ లేనట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.