ETV Bharat / business

అమెజాన్​లో లక్ష ఉద్యోగాల నియామకం - అమెజాన్​

కరోనా కారణంగా ఒకవైపు ఉన్న ఉద్యోగాలు పోతుంటే.. ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ మాత్రం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఆన్​లైన్​ షాపింగ్​కు పెరుగుతున్న డిమాండ్​ను చేరుకునేందుకు 1,00,000 నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

Amazon
అమెజాన్​లో లక్ష ఉద్యోగాల నియామకం
author img

By

Published : Sep 14, 2020, 2:51 PM IST

కరోనా కారణంగా ఆన్​లైన్​ షాపింగ్​ వైపే మొగ్గుచూపుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్​కు తగినట్లుగా సేవలందించేందుకు సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించింది ఈ-కామర్స్​​ దిగ్గజం అమెజాన్​. ఈ ఏడాది మరో 1,00,000 మందిని తీసుకోనున్నట్లు ప్రకటించింది. ప్యాకింగ్​, ఆర్డర్ల క్రమబద్ధీకరణ, రవాణా​ విభాగాల్లో పార్ట్​టైం, ఫుల్​టైమ్​ విధానంలో అవసరం ఉన్నట్లు తెలిపింది సంస్థ. కరోనా సంక్షోభంతో ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా అమెజాన్​ భారీ మొత్తంలో ఉద్యోగాలు కల్పించటం విశేషం.

ఈ కొత్త నియామకాలు సంస్థ హాలీడే-హైరింగ్​కు సంబంధించినవి కావని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రైమ్​ డే సమయాల్లో మరింత మందిని తాత్కాలిక ప్రతిపాదికన నియమించే అవకాశం ఉంది.

పెరుగుతున్న డిమాండ్​ మేరకు ఇప్పటికే ఈ ఏడాది తొలినాళ్లలో 1,75,000 మంది సిబ్బందిని నియమించుకుంది అమెజాన్​. మరో 33వేల కార్పొరేట్​, టెక్​ నిపుణులు అవసరమని కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఈనెలలో ప్రారంభించబోతున్న 100కుపైగా గిడ్డంగులు, ప్యాకేజీ కేంద్రాల వంటి ఇతర ప్రాంతాల్లో సిబ్బంది అవసరమవుతారని తెలిపింది.

అమెజాన్​ ప్రైమ్​ డే సహా హాలిడే షాపింగ్​ రద్దీతో సంస్థ గిడ్డంగులు బిజీగా ఉండబోతున్నాయి. ఆయా రోజుల్లో భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో అందుకు తగిన విధంగా సిద్ధమవుతోంది. కానీ, హాలీడే హైరింగ్​లో ఎంతమందిని తీసుకుంటున్నారో ప్రకటించలేదు. గత ఏడాది హాలీడే షాపింగ్​ సమయంలో 2 లక్షల మందికిపైగా నియమించుకుంది సంస్థ.

ఇదీ చూడండి: 33వేల ఉద్యోగాల నియామకానికి అమెజాన్​ సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.