Amazon Prime Subscription Charges: అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు సంస్థ షాక్ ఇచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ధరలు భారీగా పెంచింది. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్లాన్ ధరలను కూడా సవరించింది. పెంపునకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే అమెజాన్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కొత్త ప్లాన్లు సోమవారమే అమల్లోకి వచ్చాయి.
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ప్రైమ్ వీడియోలు, ప్రైమ్ మ్యూజిక్‌తోపాటు, ఉచిత హోమ్ డెలివరీ వంటి ప్రయోజనాలు అందుతున్నాయి. ఇందుకు ఏడాదికి రూ.999 అమెజాన్ వసూలు చేస్తోంది. కొవిడ్ నేపథ్యంలో ఓటీటీలకు ఈ మధ్య డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి తోడు ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్ల వైపు కూడా పెద్ద ఎత్తున వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ సమయంలో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచనున్నట్లు అమెజాన్ పేర్కొంది.
ఛార్జీల్లో మార్పులు ఇలా..
ప్లాన్ టైప్ | పాత ధర | కొత్త ధర |
వార్షిక చందా | రూ.999 | రూ.1499 |
త్రైమాసిక చందా | రూ. 329 | రూ. 459 |
నెలవారీ చందా | రూ. 129 | రూ. 179 |
యూత్ మెంబర్ షిప్ ఇలా..
ప్లాన్ టైప్ | పాత ధర | కొత్త ధర |
వార్షిక చందా | రూ.749 | రూ.499 |
త్రైమాసిక చందా | రూ. 299 | రూ. 164 |
నెలవారీ చందా | రూ. 89 | రూ. 64 |
ఇదీ చూడండి:
Tega Industries IPO: అదరగొట్టిన టెగా.. ఒక్కో లాట్‌పై రూ.10 వేల లాభం