ETV Bharat / business

Amazon Prime Day Sale: మొబైల్స్​పై అమెజాన్​ ఆఫర్ల బొనాంజా! - ప్రైమ్‌ డే సేల్‌

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వార్షిక 'ప్రైమ్‌ డే సేల్‌' జులై26 నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆ సంస్థ ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది.

Amazon Prime Day sale
అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌
author img

By

Published : Jul 26, 2021, 6:03 AM IST

Updated : Jul 26, 2021, 7:12 AM IST

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వార్షిక 'ప్రైమ్‌ డే సేల్‌'లో భాగంగా సరికొత్త ఆఫర్లను ముందుకు తీసుకొస్తోంది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్‌ జరగనుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలిసి 10 శాతం రాయితీ కల్పించనుంది. ఇక ఈసారి 'అడ్వాంటేజ్‌- జస్ట్‌ ఫర్‌ ప్రైమ్‌' పేరిట ప్రైమ్‌ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్​లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై ప్రకటించిన ఆఫర్లు ఇలా ఉన్నాయి.

  • ఐక్యూ జెడ్​3 5జీ ఫోన్​పై సుమారు రూ.1,500 కూపన్​ డిస్కౌంట్​ లభించనుంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ డిస్కౌంట్​తో ఈ ఫోన్​ రూ.17,000లకు రానుంది.
  • షియోమీ ఎంఐ 10ఐ 5జీ స్మార్ట్​ఫోను ఎక్సేంజ్​ ఆఫర్ రూ.3000 తగ్గింపుతో రూ. 20 వేల లోపు రానుంది.
  • వన్​ప్లస్​ నోర్డ్​ 2 5జీ ఫోన్​పై వేయి రూపాయిల అడిషినల్​ డిస్కౌంట్​ లభించనుంది. అంతేగాకుండా ప్రైమ్​డే నాడు ఈ ఫోన్​ సూమారుగా రూ. 30వేలకు రానుంది.
  • వన్​ప్లస్​ 9ఆర్​ 5జీ ఫోన్​పై వినియోగదారులకు కూపన్స్​పై నాలుగు వేల రూపాయిలు ఎక్సేంజ్​ ఆఫర్​ కింద మరో 5వేల రూపాయిలు తగ్గనున్నాయి.
  • వన్​ప్లస్​ నోర్డ్​ సీఈ 5జీ మొబైల్​ ఫోన్​పై హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ డిస్కౌంట్​ కింద వేయి రూపాయిలు ఆఫర్​ లభించనుంది. అంతేకాకుండా జియో వినియోగదారులు సుమారు రూ. 6వేల వరకు లబ్ధిపొందనున్నారు.
  • రెడ్​మీ నోట్​ 10టీ 5జీ ఫోన్​ ప్రైమ్​డే నాడు రూ.13,999లకు లభించనుంది.
  • శాంసంగ్​ గెలాక్సీ ఎం42 5జీపై సుమారు రూ. 10వేల వరకూ కూపన్​ ఆఫర్స్​ పొందగలుగుతారు.

ఇవేకాక ఇతర బ్రాండ్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్లు ఉన్నాయి.

కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేవారికి సైతం అమెజాన్ ఆఫర్లు ప్రకటించింది. సంవత్సరానికి రూ.999, మూడు నెలలకు రూ.329గా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను నిర్ణయించింది. ఇక 18-24 ఏళ్ల యువకులకు 'యూత్‌ ఆఫర్‌' కింద సబ్‌స్క్రిప్షన్‌ ధరలో 50శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. ప్రైమ్‌కు సైన్‌ అప్‌ అయిన తర్వాత వయసును ధ్రువీకరించి వెంటనే 50శాతం క్యాష్‌బ్యాక్‌ పొందడం ద్వారా ఈ ఆఫర్‌ను సొంతం చేసుకుకోవచ్చు.

ఇదీ చూడండి: Big Saving Days: స్మార్ట్​ఫోన్లపై అదిరే ఆఫర్లు

Last Updated : Jul 26, 2021, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.