ఎన్నడూ లేనంత అధికంగా తమ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2021(Amazon Great Indian Festival) అమ్మకాలు ప్రారంభమయ్యాయని అమెజాన్(Amazon Sale) ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ చెప్పారు. విక్రయదారుల సంఖ్య ఏడాది క్రితంతో పోలిస్తే 60 శాతం పెరిగిందని, రెండు-మూడో అంచె పట్టణాల నుంచీ ప్రైమ్ సభ్యత్వం, కొనుగోళ్లు కూడా అధికంగా జరుగుతున్నాయని తెలిపారు.
నెలపాటు జరిగే ఈ ప్రత్యేక విక్రయాలలో అనేక కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించబోతున్నామని వివరించారు. వాల్‌మార్ట్ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్ కూడా తమ లాయల్టీ పథకం ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌కు గతేడాదితో పోలిస్తే 40 శాతం వృద్ధి లభించిందని, మూడో అంచె పట్టణాల నుంచే 45 శాతం కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొంది.
స్మార్ట్‌ఫోన్లు మార్చుకుని, కొత్తది తీసుకునేందుకు పలువురు కొనుగోలుదార్లు ఉత్సుకత చూపుతున్నారని ఇకామర్స్ దిగ్గజాలు పేర్కొంటున్నాయి. ఐఫోన్ 12, 12 మినీ ఫోన్లకు అమిత ఆదరణ లభిస్తోందని తెలిపాయి.
ఇదీ చదవండి: క్యూ2లో డీమార్ట్ ఆదాయం 46.6% వృద్ధి