ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్‌తో ముందుకొచ్చింది. 'ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్' సేల్‌తో వివిధ రకాల మొబైల్స్‌పై రాయితీలను ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై 40శాతం, ఎలక్ట్రిక్ ఉపకరణాలపై 80శాతం వరకు రాయితీలు ఇవ్వనుంది. డిసెంబరు 25 వరకూ ఈ సేల్ నడవనుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్/క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈఎంఐలపై 10% తక్షణ రాయితీ అందిస్తోంది. శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమీ, యాపిల్, ఓప్పో, వివో, నోకియా, హానర్ సహా మరిన్ని కంపెనీల ఫోన్లపై అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, 12నెలల వరకూ నోకాస్ట్ ఈఎంఐలు అమెజాన్ అందిస్తోంది.
ఫోన్లపై ఆఫర్లు ఇలా..
- ఈ సేల్‌లో షియోమీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్ ఫోన్లపై రూ.3,500 వరకూ ధర తగ్గనుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లో రూ. 1,500 వరకూ తగ్గనుంది. ఈ ఆఫర్‌కు కాలపరిమితి ఉంది.
- శామ్‌సంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లోని శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51 రూ. 22,999కే లభించనుంది. గెలాక్సీ ఎం31 ప్రైమ్ ఎడిషన్ రూ. 16,499కు, గెలాక్సీ ఎం31 రూ. 19,499కు, గెలాక్సీ ఎం21 రూ. 13,999కు దొరకనున్నాయి.
- వన్‌ప్లస్‌కు చెందిన 7టి సిరీస్‌పై రూ.10,000 వరకూ తగ్గుదల కనిపిస్తోంది. వన్‌ప్లస్ 8టి సిరీస్‌పై హెచ్‌డీఎఫ్‌సీ వినియోగదారులకు పదిశాతం అదనపు రాయితీ లభించనుంది.
- ఐఫోన్ 11, ఐఫోన్ 7 ఫోన్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారులకు ఆఫర్లు లభించనున్నాయి.
- వివో ఫోన్లపై రూ.7,000 తగ్గింపుతో పాటు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లపై రూ. 5,000 తగ్గనుంది.
- ఒప్పో ఫోన్లపై రూ.10,000 వరకూ తగ్గింపు ఆఫర్లుండగా, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లపై రూ.1,000 తగ్గనుంది.
- నోకియా ఫోన్లపై రూ.3,000తో పాటు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లపై రూ.2,000 వరకూ తగ్గనుంది.
- హానర్ కంపెనీ ఫోన్లపై రూ. 2,000 వరకూ తగ్గింపును అమెజాన్ అందిస్తోంది.
ఇదీ చూడండి:ఎంఐ నుంచి 108 మెగా పిక్సెళ్ల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్