దేశంలో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన ఎయిర్టెల్.. వినియోగాదరులకు షాకిచ్చింది. ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను 60 శాతం పెంచింది. దీనితో ఎంట్రీలెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.79కి చేరింది. ఇంతకు ముందు ఇది.. రూ.49గా ఉండేది.
ప్రయోజనాలు కూడా పెంపు..
ప్లాన్ ధర పెంపుతో పాటు ప్రయోజనాలు కూడా పెంచినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. రూ.79 రీఛార్జ్‌తో.. ఇంతకు ముందున్న ప్లాన్‌తో పోలిస్తే.. 4 రెట్లు అధిక ఔట్‌గోయింగ్ నిమిషాలు, రెండింతల అధిక డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది.
రూ.79 ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఇకపై 28 రోజుల వ్యాలిడిటీతో రూ.64 టాక్‌టైం, 200 డేటా లభించనుంది.
యూజర్ల నుంచి కనీస ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికల్లో భాగంగానే టెలికాం సంస్థలు ఇటీవల టారిఫ్‌లు పెంచుతున్నయి. ఎయిర్టెల్ గత వారమే.. పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌ను కూడా సవరించిది. మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వి) కూడా ఇటీవల పలు ప్లాన్లలో మార్పులు చేసింది.
ఇదీ చదవండి:ఏ వస్తువుకు ఎంత ధర? కంపెనీల ఇష్టమేనా?