ETV Bharat / business

ఉక్రెయిన్​ నుంచి భారతీయుల తరలింపు విమానాల ఖర్చు ఎంతో తెలుసా?

author img

By

Published : Feb 27, 2022, 8:41 PM IST

Updated : Feb 27, 2022, 10:55 PM IST

Air India flight fare: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే విమానాలకు అయ్యే ఖర్చు తెలిస్తే షాకవ్వాల్సిందే. వామ్మో గంటకు అంత ఖర్చవుతుందా అని నోరు వెల్లబెట్టాల్సిందే!. ఆ విమానాలు రాను పోను ఎంత వ్యయమవుతుందో ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ అధికారు తెలిపారు.

Air india flight fare
Air india flight fare

Air India flight fare: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తోంది. ఈ మేరకు విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతోంది. ఇప్పటి వరకు వందలాది మంది స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే, ఈ ప్రత్యేక తరలింపు కార్యక్రమంలో ఒక్కో విమానం పోయిరావడానికి రూ.1.10 కోట్ల వరకు ఖర్చవుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.

ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగరీ దేశాలకు ఎయిరిండియా ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతోంది. ఈ తరలింపునకు డ్రీమ్‌లైనర్‌గా పిలిచే బోయింగ్‌ 787 అనే భారీ విమానాన్ని వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే అద్దెకు తీసుకుంది. సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విమానాన్ని నడపడానికి గంటకు రూ.7-8 లక్షలు ఖర్చవుతోంది. మొత్తం వ్యయం విమానం నడిచే సమయం, దూరంపై ఆధారపడి ఉంటుంది. సిబ్బంది, ఇంధనం, నావిగేషన్‌, ల్యాండింగ్‌, పార్కింగ్‌ ఛార్జీలు అన్నింటికీ కలుపుకొని ఇంత వెచ్చించాల్సి వస్తోంది.

ఈ విమానాలు చాలా సేపు ప్రయాణించాల్సి ఉన్న నేపథ్యంలో అదనపు సిబ్బంది అవసరమవుతుంది. కొందరు విధులు నిర్వర్తిస్తుంటే.. మరికొందరు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రొమేనియాలోని బుకారెస్ట్‌, హంగరీలోని బుడాపెస్ట్‌లకు ఎయిరిండియా విమానాలను నడుపుతోంది. ఈ రెండూ సంస్థ రెగ్యులర్‌ షెడ్యూల్‌లో లేని నగరాలు. ఫ్లైట్‌వేర్‌ అనే వెబ్‌సైట్‌ ప్రకారం.. బుకారెస్ట్‌ నుంచి శనివారం ముంబయి చేరుకున్న విమానం దాదాపు ఆరు గంటలు ప్రయాణించింది. బుడాపెస్ట్‌ నుంచి దిల్లీకి వచ్చిన విమానానికి సైతం దాదాపు అంతే సమయం పట్టింది. ఈ నేపథ్యంలో గంటకు రూ.7-8 లక్షల చొప్పున మొత్తం ప్రయాణానికి రూ.1.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా. డ్రీమ్‌లైనర్‌ నడవడానికి గంటకు 5 టన్నుల ఇంధనం అవసరమవుతుంది.

ఇదీ చూడండి: రష్యాపై మరిన్ని ఆంక్షలు.. ఐసీజే తలుపుతట్టిన ఉక్రెయిన్​

Last Updated : Feb 27, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.