ETV Bharat / business

కొత్త కొలువులపై 80శాతం భారతీయ విద్యార్థుల నమ్మకం! - Pearson survey

కొవిడ్-19 సంక్షోభం కారణంగా కొత్త ఉద్యోగాలు, నైపుణ్యాల అవసరం పెరుగుతుందని 80శాతం మంది భారతీయ విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సర్వేలో తెలిపింది డిజిటల్ లెర్నింగ్ సంస్థ పీర్సన్​. ప్రపంచవ్యాప్తంగా 88 శాతం మంది విద్యార్థులు.. ప్రాథమిక, ఉన్నత విద్యలో ఆన్​లైన్​ లెర్నింగ్ శాశ్వతంగా ఉంటుందని అభిప్రాయపడినట్లు పేర్కొంది.

80% Indian students think new jobs will soon arise: Survey
'కొత్త కొలువులొస్తాయని 80శాతం భారతీయ విద్యార్థుల నమ్మకం'
author img

By

Published : Aug 13, 2020, 5:47 AM IST

ప్రపంచవ్యాప్తంగా 82 శాతం మంది విద్యార్థులు కొవిడ్ సంక్షోభం కారణంగా కొత్త కొలువులు వస్తాయని, నైపుణ్య అవసరాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నట్లు ప్రముఖ డిజిటల్​ లెర్నింగ్​ సంస్థ పీర్సన్​ తెలిపింది. భారతీయ విద్యార్థుల్లో 80శాతం మంది కూడా దీనిని నమ్ముతున్నారని పేర్కొంది. వీరిలో 77 శాతం మంది కరోనా కారణంగా తమ జీవనోపాధి మార్గం గురించి పునరాలోచించుకోవాల్సి వచ్చిందని తెలిపినట్లు సర్వే పేర్కొంది.

భారత్​ నుంచి 1000మంది సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 7000మంది విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించింది పీర్సన్ సంస్థ. వీరిలో 88 శాతం మంది ప్రాథమిక, ఉన్నత విద్యలో ఇక ఆన్​లైన్​ లెర్నింగ్ శాశ్వతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.​

కరోనా కారణంగా.. పనిచేసే విధానంలో శాశ్వత మార్పులు ఇప్పటికే వచ్చినట్లు సర్వేలో పాల్గొన్న 82శాతం మంది భారతీయ విద్యార్థులు చెప్పారు. వీరిలో 71 శాతం మంది కళాశాలలు, యూనివర్సిటీలను తిరిగి ప్రారంభించడం అత్యంత ముఖ్యమన్నారు. 75 శాతం మంది మాత్రం అలా చేస్తే విద్యార్థులకు ప్రమాదమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

84శాతం మంది భారతీయ విద్యార్థులు అసమానత్వం తొలగిపోయేలా పాఠశాలలు చూడాలని సూచించినట్లు సర్వే పేర్కొంది. 74 శాతం మంది కొవిడ్-19 కారణంగా విద్యార్థుల్లో అసమానతలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 'పారదర్శక పన్ను విధానం' వేదికను ప్రారంభించనున్న మోదీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.