ETV Bharat / business

ఆర్థిక స్వేచ్ఛ కోసం అడుగులు వేయండిలా! - దీర్ఘకాలిక ఆలోచన

ఒక మహమ్మారి మన జీవితాన్ని మార్చేసింది. ఆర్థికంగా మనం ఎంత స్థిరంగా ఉన్నాం అనేది స్పష్టంగా తెలిసేలా చేసింది. అనుకోని ఆపద వస్తే తట్టుకోవడం ఎంత మేరకు సాధ్యం అనేదీ అర్థమయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం.. ఉద్యోగాలు పోవడం, ఆదాయాలు తగ్గడం, స్టాక్‌ మార్కెట్లో అనిశ్చితి.. లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం.. ఒక్కటేమిటి కరోనా సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లు ఉంది. ఇలాంటి పరిస్థితి మున్ముందు ఎదురైతే ఎలా.. దానికి మనం సిద్ధంగా ఉన్నామా.. ఎలాంటి చిక్కులు వచ్చినా ఎదుర్కునే ఆర్థిక స్వేచ్ఛ మనకుందా? దాన్ని సాధించాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.

7 Steps to Financial Freedom
అడుగులివే... ఆర్థిక స్వేచ్ఛకు
author img

By

Published : Aug 16, 2020, 11:16 AM IST

మీరు, మీ కుటుంబ సభ్యులు.. ప్రస్తుతం.. భవిష్యత్తులోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేని జీవితం గడపాలని అనుకుంటారు కదా.. ఆదాయం తగ్గినా.. ఉద్యోగం పోయినా.. మహమ్మారితో ఆరోగ్యం దెబ్బతిన్నా.. ఆర్థికంగా ఎంత స్థిరంగా ఉండగలరు? పదవీ విరమణ నాటికి మీరు అన్ని బాధ్యతలకూ అవసరమైన నిధిని ఆర్జించారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

దీర్ఘకాలిక ఆలోచన..

మనమంతా నిన్న భారత స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా చేసుకున్నాం. ఎన్ని పోరాటాల ఫలితంగా మనం స్వేచ్ఛ పొందామో ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఆర్థిక స్వేచ్ఛ ఇలాంటిదే. ఏదో ఒక రోజులోనే దీన్ని సాధించలేం. ఏదో కొంత మొత్తం దాచిపెట్టినంత మాత్రాన ఇది సాధ్యం కాదు. పొదుపు చేసిన మొత్తం మన ఖర్చులను మించి రాబడినిచ్చేలా పెట్టుబడులు పెట్టాలి. దీనికోసం అనువైన పెట్టుబడి మార్గాలను అన్వేషించాలి. ఉద్యోగంలో చేరినప్పుడే.. 40 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయాలని ఆశిస్తే.. అందుకు అనుగుణంగా మన పెట్టుబడులూ కొనసాగాలి. ఉద్యోగంలో చేరినప్పుడు నెలకు రూ.1,000-రూ.1,500లతో ప్రారంభమైన పెట్టుబడి ఏటా పెంచుతూ వెళ్లాలి. కాస్త నష్టభయం వచ్చినా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలి. దీర్ఘకాలంపాటు పెట్టుబడులు కొనసాగించడం ద్వారా రూపాయి సగటు లభిస్తుంది. అదే సమయంలో మొత్తం డబ్బును ఒకేచోట మదుపు చేయకుండా చూసుకోవాలి. పెట్టుబడి పెట్టిన ప్రతి పథకమూ.. మీరు ఆర్థిక స్వేచ్ఛను సాధించేందుకు ఉపకరించేలా ఉండాలన్నది మాత్రం మర్చిపోకూడదు.

ఎప్పుడూ మంచి తరుణమే..

చేతిలో డబ్బు ఉంచుకొని, సరైన సమయానికి పెట్టుబడి పెడతామని అనుకుంటూ ఉంటే ఆ ముహూర్తం ఎప్పుడూ రాకపోవచ్చు. అలాంటప్పుడు సాధించాల్సిన లక్ష్యం రోజురోజుకూ దూరం వెళ్లిపోతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మనకు ఆలోచన వచ్చిన క్షణమే మంచి సమయం. పెట్టుబడుల కోసం అంతకుమించిన తరుణం మరోటి లేదు. చిన్న మొత్తమా? పెద్ద మొత్తమా? అని చూడకుండా.. ఎంతోకొంత మదుపు చేయడమే మేలు. రూ.100తోనూ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ఆర్థిక స్వేచ్ఛ దిశగా మొదటి అడుగు వేయడం ఎప్పుడూ ఆలస్యం చేయొద్దు. సమయం గడస్తున్న కొద్దీ.. పెట్టుబడి మొత్తాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించండి.

అధిక రాబడి వచ్చేలా..

ఒక పెట్టుబడిని ఎంచుకునేటప్పుడు అది ఎంత మేరకు రాబడినిచ్చేందుకు అవకాశం ఉందనేది పరిశీలించాలి. మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఎంచుకున్నప్పుడు అది ఎక్కడెక్కడ మదుపు చేస్తుందనేదీ తెలుసుకోవాలి. భవిష్యత్‌ ఇప్పుడు గందరగోళంగా ఉందన్నది కాదనలేని వాస్తవం. ఆదాయాల మాట ఎలా ఉన్నా.. అప్పులు పెరిగే అవకాశాలు మాత్రం ఎక్కువే. కాబట్టి, మన పెట్టుబడులు నామమాత్రపు రాబడినిచ్చేలా కాకుండా.. కాస్త భరోసానిచ్చేలా ఎంచుకోవాలి. తక్కువ గిట్టుబాటయ్యేచోట ఉన్న డబ్బును.. అధిక రాబడినిచ్చే పథకాలకు మళ్లించాలి.మాత్రం మర్చిపోకూడదు.

కోరిక ఉంటేనే సరిపోదు..

అందరూ స్వాంతంత్య్రం కావాలని కోరుకున్నారు. కానీ, దానికోసం పోరాడింది కొందరే. ఇదే విధంగా.. ఆర్థిక స్వేచ్ఛ కావాలని కోరిక అందరికీ ఉంటుంది. లక్ష్యాలనూ విధించుకుంటారు. కానీ, అందుకు అనుగుణంగా ఆచరణీయమైన ప్రణాళిక ఉందా లేదా అనేదే ఇక్కడ ప్రధానం. సాధించాల్సిన కోరికల జాబితా ఎలా ఉంటుందో.. వాటిని వాస్తవాలుగా మార్చేందుకు ఏ మార్గాన్ని అనుసరించాలనేది ప్రణాళిక చెబుతుంది. ఆయా లక్ష్యాలను సాధించేందుకు క్రమానుగత పెట్టుబడులతో ముందుకు వెళ్లడం ద్వారా మీ కుటుంబం ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తుంది. ఈ ప్రణాళికలను సొంతంగా రూపొందించుకోవడం సాధ్యం కాకపోతే.. ఆర్థిక నిపుణుల సహాయం తీసుకోండి. మీ ఆలోచనలనూ, కోరికలనూ, లక్ష్యాలనూ వారికి వివరించండి. అప్పుడే వారు సరైన ప్రణాళికలను రూపొందిస్తారు. దీన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడమూ తప్పనిసరి. కరోనా తర్వాత ప్రతి విషయంలోనూ ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్థిక విషయాల్లోనూ ఇది తప్పనిసరి.

రేపటి కోసం..

సరైన పథకంలో మదుపు చేయడానికి కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. మీ ఆర్థిక లక్ష్యం స్వల్పకాలమా? దీర్ఘకాలమా? అనేది ముందుగా విశ్లేషించుకోండి. ఇది తెలిస్తేనే ఏయే పథకాలు ఎంచుకోవాలనే విషయంలో స్పష్టత వస్తుంది. నష్టభయం ఉన్న పథకాల్లో దీర్ఘకాలం మదుపు చేసినప్పుడే ప్రయోజనం. స్వల్పకాలిక లక్ష్యాల కోసం షార్ట్‌ టర్మ్‌ ఫండ్లు మేలు. ఇందులో నష్టభయం తక్కువగా ఉంటుంది. దీర్ఘకాల మదుపు కోసం తక్కువ లాభాలనిచ్చే ఫండ్లను ఎంచుకున్నా.. స్వల్పకాలిక పెట్టుబడికి అధిక నష్టభయం ఉన్న పథకాల్లో మదుపు చేసినా.. ఇబ్బందులు తప్పవు. సరైన పోషకాహారం తీసుకున్నప్పుడే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెట్టుబడులూ అంతే.. సరైన నిష్పత్తిలో.. ఉన్నప్పుడే ఆర్థికారోగ్యం బాగుంటుంది. అనుకున్న లక్ష్యాలను సాధించే ఆర్థిక స్వాతంత్య్రం మనకు లభిస్తుంది.

రాఘవ్‌ అయ్యంగార్, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్, యాక్సిస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.