ETV Bharat / business

లాక్​డౌన్​ కాలంలో 6.5 లక్షల ఉద్యోగాల కోత​! - Jobs lose news

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ సమయంలో బ్రిటన్​లో సుమారు 6.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు వెల్లడించింది ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం. అయితే.. ప్రభుత్వం ఉద్యోగ భద్రతకు సమగ్ర ప్రణాళిక రచిస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునాక్​తెలిపారు. ముందు ముందు మరింత క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు.

lose jobs in UK's COVID-19 lockdown
లాక్​డౌన్​లో కాలంలో 6.5 లక్షల ఉద్యోగాల కోత​!
author img

By

Published : Jul 17, 2020, 12:16 PM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి లక్షల మంది రోడ్డునపడ్డారు. మార్చి నుంచి జూన్​ మధ్య కాలంలో విధించిన లాక్​డౌన్​తో బ్రిటన్​లో సుమారు 6.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు వెల్లడించారు ఆ దేశ ఆర్థిక మంత్రి​ రిషి సునాక్​. రానున్న రోజుల్లో మరింత క్లిష్ట పరిస్థితులు రాన్నాయని.. అందుకే ప్రభుత్వం సమగ్ర ఉద్యోగ కల్పన ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్పారు.

తూర్పు లండన్​లోని ఉద్యోగ కల్పన కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా జాతీయ గణాంకాల విభాగం తాజా నివేదికలోని కీలక అంశాలను వెల్లడించారు భారత సంతతి నేత సునాక్​.

ఓఎన్​ఎస్​ నివేదికలోని కీలక అంశాలు..

  • బ్రిటన్​లో ఈ ఏడాది 16-24 ఏళ్ల వయస్సులోని నిరుద్యోగుల్లో మరో 47వేల మంది చేరారు. అయితే.. ఇతర వయస్సు గ్రూపుల్లో మాత్రం నిరుద్యోగిత రేటు స్థిరంగా ఉంది.
  • కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా వారం వారి పనిగంటలు రికార్డు స్థాయిలో 175.3 మిలియన్ల (16.7 శాతం) తగ్గి 877.1 మిలియన్లకు పడిపోయాయి. 1971లో పనిగంటల అంచనాలు ప్రారంభించిన తర్వాత ఇదే అత్యల్పం.
  • లాక్​డౌన్​ తర్వాత ఉద్యోగాల కోత జూన్ నెల​లో తగ్గింది. యూనివర్సల్​ క్రెడిట్​ స్టేట్​ ఫండ్​ ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 28,100ల మంది తగ్గి మే-జూన్​ మధ్య 2.6 మిలియన్లకు పడిపోయింది.
  • కరోనా వైరస్​ జాబ్​ రిటెన్షన్​ పథకం ద్వారా ప్రస్తుతం 9,4 మిలియన్ల మంది కార్మికులు సాయం పొందుతున్నారు. ఈ పథకం అక్టోబర్​లో ముగియనుంది.

ఇదీ చూడండి:ఆ కంపెనీలో 25వేల మంది ఉద్యోగులు తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.