దేశాన్ని కుదిపేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దాదాపు 50 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఓ సర్వే వెల్లడించింది. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా పేరుతో అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఈ సర్వే చేసింది.
సీఎంఐసీ-సీపీడీఎక్స్ డాటా ఆధారంగా చేసిన ఈ సర్వేలో యువత ఎక్కువగా ఉపాధికి దూరమైనట్లు తేలింది. ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికం మహిళలేనని సర్వే పేర్కొంది.
రెండేళ్లలో రెట్టింపు
నిరుద్యోగం రేటు 2018 నాటికి 6 శాతానికి చేరింది. ఇది 2000 నుంచి 2011 మధ్య దశాబ్దకాలంలో ఉన్న నిరుద్యోగ రేటు కన్నా రెండింతలు ఎక్కువని సర్వే పేర్కొంది.
నిరుద్యోగుల్లో అత్యధికులు పట్టభద్రులే...
నివేదిక ప్రకారం... పట్టణాల్లో నివసిస్తూ పని చేసే సామర్థ్యం ఉన్న మహిళల్లో మొత్తం 10 మంది గ్రాడ్యుయేట్లు ఉండగా... వారిలో 34 శాతం మంది నిరుద్యోగులే.
ఉన్నత చదువులు పూర్తి చేసిన వారి నుంచి నామమాత్రపు చదువులు (పూర్తిగా చదవు లేనివారు కూడా) నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా 2016లో జరిగిన నోట్ల రద్దు కారణంగా ఉన్న ఉద్యోగాలు పోవడం... ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలు ఎక్కువయ్యాయని నివేదిక తెలిపింది.