వరంగల్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. దిల్లీలోని పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడిన ఆయన తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్కు, రింగురోడ్డు నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చేలా పోరాడతామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'రైతుల ముఖంలో సంతోషం చూసేందుకే...'