ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విందు ఇచ్చారు. హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో 21 మంది విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఉన్నత చదువులపై వారికి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖాధికారులకు సూచించారు. కలెక్టర్‌తో కలిసి భోజనం చేయడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : జనం చైతన్యం... కబ్జాపై ఉక్కుపాదం