ఎస్సీ, ఎస్టీలంటే కేసీఆర్కు చిన్నచూపని.. ఆయన అధికారంలో ఉన్నంత వరకు వారికి న్యాయం జరగదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి ధ్వజమెత్తారు. గృహ నిర్బంధంలో ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను కలిసి సంఘీభావం తెలిపారు. ఉద్యమాలు, నిరసనలు తెలపడం తప్పా అని... ఉద్యమాలు చేయకుండానే తెలంగాణ సాధించామా అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని మరలా ప్రతిష్ఠిచి, చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
విజయశాంతి రాక తనకెంతో ధైర్యాన్నిచ్చిందని మందకృష్ణ అన్నారు. ఈనెల 22 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అంబేడ్కర్వాదుల గర్జన నిర్వహించి కేసీఆర్ నిరంకుశ, నియంతృత్వ విధానాలను ఎండగడతామని హెచ్చరించారు.