కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా తీరుపై వి.హనుమంతురావు తీవ్రంగా స్పందించారు. పార్టీకి నష్టం కలిగే కార్యక్రమాలు చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాక ముందే గాంధీభవన్ వచ్చిన వీహెచ్... కుంతియా, ఉత్తమ్ వద్దకు వెళ్లారు. పార్టీలో దీర్ఘకాలికంగా జెండాలు మోస్తున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఏవిధంగా టికెట్లు ఇస్తారని నిలదీశారు.
ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ టికెట్లు కేటాయిస్తున్నారని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలుగా ఉన్న వారికే మళ్లీ అసెంబ్లీ టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మొదటి నుంచి పార్టీ జెండాను మోస్తూ... పార్టీకి విధేయులుగా ఉన్నవారిని విస్మరిస్తున్నారని వీహెచ్ దుయ్యబట్టారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఇదీ చూడండి: అఖిలపక్ష దీక్షలో తోపులాట.. కిందపడ్డ వీహెచ్