"అధ్యక్షుడిని నిర్దోషిగా ప్రత్యేక దర్యాప్తు అధికారి రాబర్ట్ మ్యూలర్ నివేదిక పేర్కొనలేదు. పూర్తి నివేదికను వెంటనే మీడియాకు విడుదల చేయాలి." -డెమొక్రాటిక్ పార్టీ ప్రకటన
నివేదిక ఆధారంగా ట్రంప్ ప్రచారంలో పాల్గొన్న వారెవరూ రష్యాతో సంబంధాలు పెట్టుకోలేదని బార్ వెల్లడించారు. మ్యూలర్ కమిటీలో పరిశీలకుడిగా నియమితులైన అటార్నీ జనరల్ బార్ నిష్పక్షపాతంగా లేరని అభిప్రాయపడ్డారు డెమెక్రటిక్ నేతలు. ఈ కారణంగానే అటార్నీ జనరల్ విడుదల చేసిన నివేదిక సారాంశాన్ని నమ్మలేమని పేర్కొన్నారు.
2020 ఎన్నికల్లో మ్యూలర్ నివేదిక డెమొక్రాట్లకు ఆయుధంగా మారుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:'ఎందుకు పోటీ చేయట్లేదో అడ్వాణీయే చెప్పాలి'