ETV Bharat / briefs

టీవీ9 సీఈవో రవిప్రకాశ్​పై పలు కేసులు

టీవీ9 సీఈవో రవిప్రకాశ్​తో పాటు సినీ నటుడు శివాజీ, టీవీ9 ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తిపైన సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత లబ్ధి కోసం టీవీ ఛానల్​కు సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేశారని... అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదుతో పలు కేసులు నమోదయ్యాయి. ఇవాళ విచారణకు హాజరుకావాలని సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

టీవీ9 సీఈవో రవిప్రకాశ్
author img

By

Published : May 10, 2019, 12:27 AM IST

టీవీ9 సీఈవో రవిప్రకాశ్

టీవీ9 సీఈవో రవిప్రకాశ్​పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సినీ నటుడు శివాజీ, టీవీ9 ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తిపైన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత లబ్ధి కోసం టీవీ ఛానల్​కు సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేశారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవిప్రకాశ్, శివాజీ, మూర్తిలను ఇవాళ విచారణకు హాజరుకావాలని సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

పలు సెక్షన్ల కింద కేసులు

టీవీ9 ఛానల్ యాజమాన్యంలో తలెత్తిన వివాదాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదుతో టీవీ9 సీఈవో రవిప్రకాశ్, ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి, సినీ నటుడు శివాజీపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. భారతీయ శిక్షాస్మృతిలోని 406, 420, 467, 469, 471, 120(బీ) సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 66, 72 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సొంతలబ్ధి కోసం ఛానల్​కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించారని, పోర్జరీ చేశారని గత నెల 24న కౌశిక్ ఫిర్యాదు చేశారు. 30న మరో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు మోసంతో పాటు, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి... రవిప్రకాశ్, శివాజీ, మూర్తి ఇళ్లతో పాటు టీవీ9 కార్యాలయంలో సోదాలు చేశారు.

రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు

జూబ్లీహిల్స్​లోని రవిప్రకాశ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఇంట్లో రవిప్రకాశ్ లేకపోవటం వల్ల ఆయన భార్యకు... సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. వాటిని తీసుకునేందుకు ఆమె నిరాకరించడం వల్ల... పోలీసులు ఇంటికి అంటించారు. హిమాయత్ నగరలోని నటుడు శివాజీ నివాసంతో పాటు ఖైరతాబాద్​లోని మూర్తి ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం వారి కుటంబ సభ్యులకు నోటీసులు అందించారు. ముగ్గురిని కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

కీలక పత్రాలు స్వాధీనం

టీవీ కార్యాలయం వద్ద గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. రవి ప్రకాశ్ ఛాంబర్​తో పాటు... కార్యాలయంలోని ఇతర గదుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలు ల్యాప్​టాప్​లు, హార్డ్​డిస్క్​లతో పాటు... కొన్ని కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్​కు పంపుతామని వెల్లడించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.