ETV Bharat / briefs

''ట్విట్టర్​ సీఈవోకు సమన్లు జారీ''

వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, ఎన్నికల్లో జోక్యం తదితర అంశాలపై ట్విట్టర్​ను వివరణ కోరింది ఐటీ రంగంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ. ఫిబ్రవరి 25లోగా తమ ఎదుట హాజరుకావాలని ఆ సంస్థ​ సీఈవోకు సమన్లు జారీ చేసింది.

ట్విట్టర్​ సీఈవోకు సమన్ల జారీ
author img

By

Published : Feb 12, 2019, 9:03 AM IST

Updated : Feb 12, 2019, 9:24 AM IST

ఫిబ్రవరి 25 లోపు తమ ఎదుట హాజరుకావాలని ట్విట్టర్​ సీఈవోకు సమన్లు జారీ చేసింది ఐటీ రంగంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ. గత గడువు ఫిబ్రవరి 11న హాజరుకానందున ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు చెందిన జూనియర్​ అధికారులతో సమావేశమయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పింది.

సంస్థ సీఈవో జాక్​ డార్సీతో పాటు ఇతర సీనియర్లు హాజరుకావాలని పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్​ అనురాగ్​ ఠాకుర్​ పేర్కొన్నారు. త్వరలో లోక్​సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార సరళిలో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సామాజిక మాధ్యమాల్ని హెచ్చరించింది కేంద్రం. అందులో భాగంగానే ట్విట్టర్​ వర్గాల్ని తమముందు హాజరు కావాలని పిలిచింది.

ఫిబ్రవరి 11న ట్విట్టర్​ వర్గాలు హాజరు కావాల్సి ఉండగా తక్కువ సమయం కారణంగా హాజరు కాలేమని తొమ్మిదో తేదిన సమాధానమిచ్చాయి. ఐటీ చట్టానికి విరుద్ధంగా పోస్టులు చేయడం, వ్యక్తిగత ఖాతాల్లోని సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి కార్యకలాపాలపై కొద్ది రోజులుగా ఉక్కుపాదం మోపుతోంది కేంద్రం.

Intro:Body:

f

Conclusion:
Last Updated : Feb 12, 2019, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.