నూటికి నూరు శాతం తాను పార్టీ మారడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే కార్యకర్తలు, నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని దిల్లీలో తెలిపారు. కాంగ్రెస్లో ఉండి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే సత్తా భాజపాకే ఉందని పునరుద్ఘాటించారు. భాజపా నుంచి తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. రాష్ట్రంలో హస్తం పార్టీ విధానాల వల్లే రెండోసారి అధికారం కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని వెల్లడించిన ఆయన... ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు.
ఇదీ చూడండి : భాజపా నుంచి నేనే సీఎం: కోమటిరెడ్డి..!