ఇప్పటికే పది మంది కారెక్కెందుకు మందుకొచ్చారు. మరో నలుగురిని సమీకరించి, లక్ష్యాన్ని సాధించాలని తెరాస భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ సభ్యులు గెలిచారు. మూడింట రెండొంతుల మంది అంటే 14 మంది తెరాసలో కలిస్తే ఫిరాయింపుల చట్టం వర్తించదు. గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఇలాగే గులాబీ పార్టీలో విలీనం అయింది. ఇటీవల శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం కూడా విలీనమైంది.
ఎన్నికలకంటే ముందే మరో నలుగురు ఎమ్మెల్యేలను సమీకరించి వెంటనే విలీన ప్రక్రియను పూర్తి చేయాలని తెరాస యోచిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి:అరకిలోమీటరు మోసి.. అంబులెన్స్‌లో ప్రసవం