జపాన్‌లోని క్యోటోలోని ఓ యానిమేషన్ స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 33కు పెరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
దేశంలోనే పెద్ద నగరాల్లో ఒకటైన క్యోటోలోని యానిమేషన్ సంస్థ భవనంపై ఓ వ్యక్తి గుర్తు తెలియని ద్రవాన్ని చల్లి నిప్పు అంటించాడు. మూడంతస్తుల భవనం మొత్తానికి మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారుల అంచనా. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
చాలా మంది మంటలు, పొగ వల్ల స్పృహ కోల్పోయారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఘటనకు పాల్పడిన వ్యక్తి కూడా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అతడిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: సముద్రంలో దిగిన విమానం- బీచ్ వాకర్స్ షాక్