ETV Bharat / briefs

ధూల్​పేట్ ప్రయాణం.. గుడుంబా నుంచి గంజాయి వైపు - ILLEGAL CANNABIS TRANSPORTATION

గుడుంబాను నమ్ముకుని జీవనం కొనసాగిస్తూ వచ్చిన కుటుంబాలు ఇప్పుడు గంజాయి విక్రయాల వైపు దృష్టిపెట్టాయి. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్నా పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు. దీని వల్ల ఈ అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా నివారించడం అధికారులకు సవాల్​గా మారింది.

ఉపాధి కరవై గంజాయి విక్రయాల వైపు దృష్టి
author img

By

Published : Jun 27, 2019, 1:29 PM IST

ధూల్ పేట్...హైదరాబాద్ పాత నగరంలో ఒక నాటి గుడుంబా తయారీకి ప్రధాన స్థావరం. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో రూపొందించిన వ్యూహాలకు గుడుంబా తయారీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. గుడుంబాను నమ్ముకుని జీవనం కొనసాగిస్తూ వచ్చిన కుటుంబాలు ప్రత్యామ్నాయంగా ఉపాధి కరవై గంజాయి విక్రయాల వైపు దృష్టిపెట్టడం అధికారులను కలవరపెడుతోంది.
'ఆపరేషన్ గంజాయి'
ఒకప్పుడు ఆపరేషన్ గుడుంబా చేపట్టి విముక్తి కలిగించిన ఎక్సైజ్ శాఖ మరోసారి ఆపరేషన్ గంజాయి వైపు వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం ధూల్ పేట్​లోనే కాకుండా నగరం వ్యాప్తంగా, శివారు ప్రాంతాల్లో ఈ గంజాయి దందా జోరుగా కొనసాగుతోంది.
'దూల్​పేట్​ మీద 24 గంటల నిఘా'
హైదరాబాద్ దూల్ పేట మీద 24 గంటల నిఘా పెట్టి ఉంచడం వల్ల ఇప్పటి వరకు సుమారు 900 కు పైగా గంజాయి కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. గంజాయి స్మగ్లింగ్, రవాణా, అమ్మకాలు కొనసాగిస్తూ పట్టుబడిన వందకుపైగా నిందితులను ఆర్టీవో ముందు బైండోవర్ చేశారు. ఎన్నిసార్లు పట్టుబడుతున్నా తిరిగి అదే అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న పదిమంది నిందితులపై పీడీ చట్టం ప్రయోగించారు. ఏడాది చొప్పున జైలుకు పరిమితం చేస్తుండటం వల్ల దూల్ పేట్​లో గంజాయి కార్యకలాపాలు అదుపులోకి వచ్చాయి. 10 గ్రాముల, 20 గ్రాముల నుంచి మొదలుకుని 100 గ్రాముల చొప్పున చెట్ల రూపంలో గంజాయిని ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు.
'పట్టుబడిన వారి కుటుంబాలకు కౌన్సిలింగ్'
రాత్రి పూట ఖరీదైన బైకులు, కార్లలో విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు గంజాయి తీసుకెళ్తుంటారు. సుమారు 1500 మంది వరకు విద్యార్థులు ఐటీ ఉద్యోగుల్ని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
'సవాల్​గా మారిన అక్రమ గంజాయి నిర్మూలన'
శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటీ ఉద్యోగులకు విక్రేతల ఫోన్ , వాట్సాప్ నెంబర్ ఇచ్చి హైటెక్ పద్ధతిలో కొనసాగిస్తున్నట్లు బయటపడింది. లాభసాటి వ్యాపారం కావడం వల్ల పెద్ద మెుత్తంలో ఈ గంజాయి విక్రయాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. రోజుకో కొత్త కోణం బయటపడుతున్న తరుణంలో అరకొర సిబ్బందితో అక్రమ గంజాయిని అరికట్టడం ఎక్సైజ్ పోలీసులకు సవాల్​గా మారింది.

అధికారులకు సవాల్​గా మారిన అక్రమ గంజాయి వ్యాపారం

ఇవీ చూడండి : అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత

Intro:హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం బ్రతుకుతెరువు కోసం ఒడిస్సా రాష్ట్రం కలవండి జిల్లా మధుర కు చెందిన నేత్రానంద కథ ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ కు అక్కడ కొన్ని నెలలు పనిచేసి ఏం జరిగిందో తెలియదు కానీ 11 నెలల క్రితం హైదరాబాద్ బంజర హిల్స్ ప్రాంతంలో తిరుగుతుండగా స్థానికులు మాతృదేవోభవ అనాధ ఆశ్రమం కు సమాచారం అందించారు. ఆశ్రమ నిర్వాహకులు మానసిక వైద్యుని సంప్రదించి వైద్యుడి సూచన మేరకు వైద్యం అందించి క్రమేణా అతడు లో మార్పులు రావడం గమనించిన ఆశ్రమ నిర్వాహకులు అతని వివరాలు కనుక్కొని ఈటీవీ భారత్ మీడియా సహకారంతో ఒడిస్సా నుండి మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి వచ్చిన కుటుంబ సభ్యులు ఎల్బినగర్ డిసిపి సన్ ప్రీత్ సింగ్ సమక్షంలలోనే తమ కుటుంబ సభ్యులకు నేత్రానందను అప్పగించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు ఈటీవీ భారత్ యాజమాన్యాన్ని డిసిపి సెంట్రింగ్ అభినందించారు.

బైట్: నేత్ర ఆనంద్ (తప్పిపోయిన యువకుడు)
బైట్: (నేత్ర ఆనంద్ బాబాయి)
బైట్ : కట్ట గిరి (ఆశ్రమ నిర్వాహకులు)

Body:Hyd_tg_42_25_Etv Bharat Reach Family_PKG_C4

Conclusion:Hyd_tg_42_25_Etv Bharat Reach Family_PKG_C4
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.