ETV Bharat / briefs

విద్యార్థుల అవగాహనలేమి... జేఈఈలో వెనుకబాటు - ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ

జేఈఈ మెయిన్స్​కు దరఖాస్తు చేసేటప్పుడు చేసిన చిన్న పొరపాటు చాలా మంది తెలుగు విద్యార్థులను ఆవేదనకు గురి చేసింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లను అవగాహన లోపంతో గుర్తించక అడ్వాన్స్​డ్​ పరీక్షకు అవకాశం కోల్పోయారు. ఇప్పుడు మార్పులకు అంగీకరించలేమని అధికారులు స్పష్టం చేశారు.

జేఈఈ విద్యార్థులు
author img

By

Published : May 8, 2019, 12:42 PM IST

జేఈఈ మెయిన్స్​కు దరఖాస్తు చేసేటప్పుడు చేసిన చిన్న పొరపాటు వేల మంది తెలుగు విద్యార్థుల కొంప ముంచింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసిన ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లపై అవగాహన లేక చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. సీబీఎస్​ఈ మార్పులకు రెండుసార్లు అవకాశం కల్పించినప్పటికీ... విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు శిక్షణా సంస్థలు కూడా అప్రమత్తం కాలేదు. ఫలితంగా కటాఫ్​ మార్కుల్లో భారీ తేడా జేఈఈ అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. జేఈఈ అడ్వాన్స్​డ్​లోనైనా మార్పు చేసుకుందామంటే అవకాశం లేదు.

దరఖాస్తులో ఈడబ్ల్యూఎస్​ విభాగాన్ని గుర్తించని విద్యార్థులు

కొత్తగా ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ

జేఈఈ మెయిన్స్​ కోసం దేశవ్యాప్తంగా 11 లక్షల 47 వేల మంది ఆన్​లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కేంద్ర సర్కారు రిజర్వేషన్​ ఖరారు చేయడం వల్ల ఈసారి దరఖాస్తులో ఆ విభాగాన్ని అధికారులు చేర్చారు. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్నవారు... ఈడబ్ల్యూఎస్​ కింద దరఖాస్తు చేసుకోవాలని సీబీఎస్​ఈ సూచించింది. ప్రస్తుత దశలో ధ్రువీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సిన అవసరం లేదు. గతంలో జనరల్​ కేటగిరీ అభ్యర్థులు కొంత మంది ఇది గమనించకుండా పాత పద్ధతిలోనే దరఖాస్తు చేశారు. కేవలం 43 వేల మంది మాత్రమే రిజర్వేషన్ల ప్రకారం ఆన్​లైన్లో తమ కేటగిరీని గుర్తించారు.

కటాఫ్​ల్లో భారీ తేడా

జేఈఈ అడ్వాన్స్​డ్​కు జనరల్​ కేటగిరీలో 89.75 పర్సంటైల్​ కటాఫ్​ ఉండగా... ఈడబ్ల్యూఎస్​కు కేవలం 78.21 పర్సంటైల్​ను ఖరారు చేశారు. దాదాపు 40 మార్కుల తేడా ఉండటం వల్ల చాలా మంది విద్యార్థులు అవకాశం కోల్పోయారు. ఇప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. నోటిఫికేషన్​లో పూర్తి వివరాలు చదవక పోవడం వల్ల నష్టపోయామని ఈడబ్ల్యూఎస్ కింద అవకాశం చేజార్చుకున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఇంటర్‌ ఫలితాలపై నేడు హైకోర్టులో విచారణ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.