ETV Bharat / briefs

రాయితీలపై నాణ్యమైన విత్తనాల పంపిణీ - రైతులు

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్​కుగానూ సర్కారు రాయితీ విత్తనాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వరి, జొన్న, పప్పు ధాన్యాలు, నూనెగింజలు... ఇలా అన్ని రకాల పంటలకు సంబంధించి 7.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలకు రాయితీపై పంపిణీ కోసం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 1,116 నోటిఫైడ్ విత్తన విక్రయ కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తైనట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

రాయితీలపై నాణ్యమైన విత్తనాల పంపిణీ
author img

By

Published : Jun 9, 2019, 11:24 PM IST

రాయితీలపై నాణ్యమైన విత్తనాల పంపిణీ

రాష్ట్రంలో రాయితీ విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతుల అవసరాల నిమిత్తం వ్యవసాయ శాఖ 7.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రాయితీపై పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 1.4 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 2.8 లక్షల క్వింటాళ్ల వరి, 2 లక్షల క్వింటాళ్ల సోయాబీన్, 35 వేల క్వింటాళ్ల పప్పుధాన్యాలు, 13 వేల క్వింటాళ్ల నూనెగింజలు, 80 వేల క్వింటాళ్ల మొక్కజొన్న, వెయ్యి క్వింటాళ్ల చిరుధాన్యాల విత్తనాలు సరఫరా చేయనుంది. ఇందుకు అనుగుణంగా విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తనాలను నోటిఫైడ్‌ విత్తన విక్రయ కేంద్రాల ద్వారా సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. 804 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 106 ఆగ్రో సేవా కేంద్రాలు, 44 జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు, 66 మన గ్రోమోర్‌ విక్రయ కేంద్రాలు ఉన్నాయి.

భూసారం పెంపొందించుకునేందుకు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ 65 వేల క్వింటాళ్లు, జనుము 17 వేల క్వింటాళ్లు, 4 వేల క్వింటాళ్లు పిల్లిపెసర ఇప్పటికే విత్తన కేంద్రాల్లో సిద్ధంగా ఉంచింది. పచ్చిరొట్ట విత్తనాలపై 65 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2.58 క్వింటాళ్ల వరి విత్తనాలు వానా కాలంలో సరఫరా చేయడానికి కూడా ఏర్పాట్లు చేసింది. కొత్త వండగాలైన తెలంగాణ సోనా - ఆర్‌ఎన్‌ఆర్‌-15048, కూనారం సన్నాలు - కేఎన్‌ఎం-118, బతుకమ్మ - జేజీఎల్‌-18047 రకాలపై వెయ్యి రూపాయల రాయితీ ఇవ్వనుంది. పాత రకాలైన ఎంటీయూ-1001, ఎంటీయూ-1010, బీపీటీ-5204, ఎంటీయూ-1061 రకాలపై క్వింటాల్‌కు 500 రూపాయల చొప్పున రాయితీ కల్పిస్తుంది.

వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం... అవసరమైన 2 లక్షల సోయాబీన్ విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ, హాకా, జాతీయ విత్తన సంస్థ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్‌, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్ తదితర జిల్లాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచింది. సోయా విత్తనంపై రాష్ట్ర ప్రభుత్వం 40.65 శాతం రాయితీ ఇవ్వనుంది. పప్పుధాన్యాలైన కంది, పెసర, మినుము పంటల సాగు, విస్తీర్ణం పెంపొందించేందుకు రాయితీ శాతం గతేడాది కంటే 15 శాతం అధికంగా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు.

చిరుధాన్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం 65 శాతం రాయితీ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రాగులు, కొర్రలు, సజ్జలు, సామలు, జొన్నలు, పచ్చజొన్నల, వరిగ పంట విత్తనాలు సరఫరా చేస్తోంది. విత్తన రాయితీ సదుపాయం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది. తద్వారా ప్రైవేటు విత్తన విక్రేతలు, దళారుల బారినపడి మోసపోవద్దని సూచించింది.

ఇవీ చూడండి: కాపాడకుండా వీడియోలు తీస్తే ఎలా?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.