హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బెంగళూరు చతికిలపడింది. 232 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగి కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్సీబీ జట్టులో గ్రాండ్‌హోమ్ (37) మినహా ఎవరూ రాణించలేకపోయారు. సెంచరీతో రాణించిన సన్‌రైజర్స్ ఓపెనర్ బెయిర్‌స్టోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
That's that from Hyderabad. The @SunRisers win by a huge margin of 118 runs against the RCB😎😎 pic.twitter.com/i1sgwuTgoh
— IndianPremierLeague (@IPL) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Hyderabad. The @SunRisers win by a huge margin of 118 runs against the RCB😎😎 pic.twitter.com/i1sgwuTgoh
— IndianPremierLeague (@IPL) March 31, 2019That's that from Hyderabad. The @SunRisers win by a huge margin of 118 runs against the RCB😎😎 pic.twitter.com/i1sgwuTgoh
— IndianPremierLeague (@IPL) March 31, 2019
వేసవిలో 'సన్‌రైజర్స్' పరుగుల వర్షం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు 'వార్నర్-బెయిర్ స్టో' లు అదిరే ఆరంభాన్నిచ్చారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
A day when a few #VIVOIPL records have already been broken! #SRHvRCB pic.twitter.com/SdGuBAyO0j
— IndianPremierLeague (@IPL) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A day when a few #VIVOIPL records have already been broken! #SRHvRCB pic.twitter.com/SdGuBAyO0j
— IndianPremierLeague (@IPL) March 31, 2019A day when a few #VIVOIPL records have already been broken! #SRHvRCB pic.twitter.com/SdGuBAyO0j
— IndianPremierLeague (@IPL) March 31, 2019
సెంచరీలతో చెలరేగిన వేళ..
సన్‌రైజర్స్ ఓపెనర్లిద్దరూ ఈ మ్యాచ్‌లో సెంచరీలు నమోదు చేశారు. ముఖ్యంగా తొలి ఐపీఎల్ సీజన్ ఆడుతున్న బెయిర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 114 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
The better celebration to a 💯?
— IndianPremierLeague (@IPL) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
#SRHvRCB #VIVOIPL pic.twitter.com/tV2q9YQtzm
">The better celebration to a 💯?
— IndianPremierLeague (@IPL) March 31, 2019
#SRHvRCB #VIVOIPL pic.twitter.com/tV2q9YQtzmThe better celebration to a 💯?
— IndianPremierLeague (@IPL) March 31, 2019
#SRHvRCB #VIVOIPL pic.twitter.com/tV2q9YQtzm
మరో ఓపెనర్ వార్నర్.. నిషేధంతో ఏడాది పాటు ఆటకు దూరమైనా... తన బ్యాట్ పవర్ తగ్గలేదని నిరూపించాడు. ఇన్నింగ్స్ చివరి వరకూ నిలిచి 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
The beauty of #VIVOIPL 😍 pic.twitter.com/kqiIE1VyCo
— IndianPremierLeague (@IPL) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The beauty of #VIVOIPL 😍 pic.twitter.com/kqiIE1VyCo
— IndianPremierLeague (@IPL) March 31, 2019The beauty of #VIVOIPL 😍 pic.twitter.com/kqiIE1VyCo
— IndianPremierLeague (@IPL) March 31, 2019
బెంగళూరు బౌలర్లలో చాహల్ మినహా మరెవరూ వికెట్లు తీయలేకపోయారు.
బెంగళూరు జట్టేనా ఇది...
ఈ సీజన్లోనైనా రాణిస్తుందనుకున్న బెంగళూరు పరిస్థితి మరీ ఘోరం. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. గ్రాండ్‌హోమ్ (37 పరుగులు) మినహా అందరూ విఫలమయ్యారు.
పార్థివ్ 11, హిట్మైర్ 9, కోహ్లీ 3, డివిలియర్స్ 1, మొయిన్ అలీ 2 పరుగులు చేసి వెనుదిరిగారు.
- రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ చేతిలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఆరు సార్లు ఔటయ్యాడు.
సన్‌రైజర్స్ బౌలర్లలో నబీ అత్యుత్తమంగా 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ 3 వికెట్లు తీసి రైజర్స్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.