ఇంజినీరింగ్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ.. హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని ఉన్నత విద్యామండలి ఎదుట ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించి... ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే రుసుములపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ జరుగుతున్నా..... ఫీజుల నియంత్రణ కమిటీ ఛైర్మన్‌ను నియమించకపోవడం సరైందని కాదని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి వచ్చి కార్యకర్తలకు నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు. కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు రుసుం పెంచుతూ తీసుకున్న విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని పాపిరెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: 2023లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతాం!